Publish Date:Feb 14, 2026
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు.. అన్న చందంగా తయారౌతోంది. ఆ పార్టీ పరిస్థితి, పలుకుబడి వేగంగా దిగజారుతున్న స్పష్టమైన సంకేతాలను తాజాగా వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా బలంగా విస్తరించి.. రాష్ట్రంలో ఇక ఈ పార్టీకి తిరుగేలేదా? అన్నట్లుగా నిలిచిన పార్టీ ఇప్పుడు కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైన దృశ్యం విస్మయపరుస్తోంది.
ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట అనుకున్న ప్రాంతాలలో కూడా మునిసిపోల్స్ లో బీఆర్ఎస్ చతికిల పడటం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ వరంగల్ లలో ఆదరణ లేకుండా పోయింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్ సత్తా చాటడంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది.
ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తమ మున్సిపాలిటీని కాపాడుకోలేకపోవడం ఆ పార్టీ పలుకుబడి ఎంతగా దిగజారిందో తేటతెల్లం చేస్తున్నది. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మున్సిపాలిటీ కే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా , హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తాం అని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ క్యాడర్ కు తాజా మునిసిపోల్స్ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మెదక్, హైదరాబాద్ శివార్లపై ఆధారపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-limited-to-thecombined-medak-district-25-214066.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.