బీఆర్ఎస్ డ‌బుల్ గేమ్‌.. టార్గెట్ రేవంత్!

Publish Date:Sep 29, 2024

Advertisement

తెలంగాణ రాజకీయానికి హైడ్రా కేంద్ర బిందువుగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ప్ర‌స్తుతం హైడ్రా పేరు మారుమోగుతుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువులు, నాలాలు క‌బ్జాలుచేసి చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాల‌పై రేవంత్ స‌ర్కార్ కొర‌డా ఝుళిపించిస్తోంది. అయితే, హైడ్రా ప్రారంభంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీఆర్ఎస్ సైతం తొలుత హైడ్రాపై నోరుమెద‌ప‌లేదు. మేముకూడా అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేయ‌డానికి అనుకూల‌మేన‌ని ప్ర‌క‌ట‌న‌లు చేసింది. బీజేపీలోని ఓ వ‌ర్గం హైడ్రాకు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ తో స‌హా ప‌లు అక్ర‌మ నిర్మాణాలు కూల్చివేసిన స‌మ‌యంలో హైడ్రాతో రేవంత్ మంచిప‌ని చేస్తున్నారంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. అయితే, క్ర‌మంగా హైడ్రాకు రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో వ్య‌తిరేక‌త మొద‌లైంది. అయితు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా విష‌యంలో ఎక్క‌డా తగ్గేదేలే అని స్పష్టంగా చెబుతున్నారు. చెరువులు, నాలాలు ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారు ఎంత‌ ప‌లుకుబ‌డి ఉన్న వారైనా వ‌దిలిపెట్టేది లేద‌ని ప‌లు స‌భ‌ల్లో ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. దీంతో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మ నిర్మాణాల‌ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ పోయింది. ఈ క్ర‌మంలో అంతే స్థాయిలో వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో పేద‌ల ఇళ్ల‌ను సైతం హైడ్రా కూల్చివేస్తుండ‌టం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు  రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ షురూ చేసింది.

 హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ కు బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేశారు. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రులు వైఎస్ఆర్‌, కేసీఆర్‌లు న‌గ‌రాన్ని అభివృద్ధి ప‌థ‌ంలో న‌డిపించారు. దీంతో భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపే పెద్ద‌పెద్ద కంపెనీల ప్ర‌తినిధులు సైతం త‌మ ఎంపిక‌లో హైద‌రాబాద్ ను త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే స్థాయికి న‌గ‌రం చేరిపోయింది. అయితే, ఇక్క‌డ అస‌లు వాస్త‌వాల‌ను ప్ర‌స్తావిస్తే.. హైద‌రాబాద్‌లో కొన్ని ప్రాంతాలు మాత్ర‌మే అభివృద్ధి చెందాయి. కొన్ని ప్రాంతాలు ఇప్ప‌టికీ మురికి వాడ‌ల్లానే ఉన్నాయి. చిన్న‌పాటి వ‌ర్షం వ‌చ్చినా రోడ్లు జ‌ల‌మ‌యం అవుతాయి. ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణం న‌గ‌రంలోని చెరువులు, నాలాల‌ను ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేయ‌డ‌మే. గ‌త‌ బీఆర్ఎస్‌ ప్ర‌భుత్వ హ‌యాంలో కేసీఆర్ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చేస్తామ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. కానీ ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా చిన్న‌పాటి వ‌ర్షానికే న‌గ‌ర ప్ర‌జ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించి  హైడ్రాకు ప్రాణం పోశారు. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రి వర్గ సహచరులు చెప్పినా రేవంత్ ప‌ట్టుద‌ల‌తో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చేస్తున్నారు. అయితే, తొలుత స‌మ‌ర్ధించిన బీజేపీ, బీఆర్ఎస్ లు.. ప్ర‌స్తుతం ప్లేట్ ఫిరాయించాయి.  రేవంత్ రెడ్డి టార్గెట్‌గా రాజ‌కీయాల‌ను షురూ చేశాయి. 

హైడ్రా విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ డ‌బుల్ గేమ్ ఆడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హైదరాబాద్‌లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి.. వాటన్నింటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం.. వరదల నుంచి నగరానికి విముక్తి కల్పిస్తామని బీఆర్ఎస్ హయాంలో 2016లోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పిందో దానినే నేడు కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుంటే.. కూల్చివేతలు సమంజసం కాదంటూ బీఆర్ఎస్ వితండ‌ వాదన చేస్తోందని కాంగ్రెస్ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలోనే మూసీనీ సుందరీకరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మూసీ సుందరీకరణ కోసం మూసీ పరిసరాల్లోని నివాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఇండ్ల  కూల్చివేతలు చేపడతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే మూసీ బాధితులకు పరామర్శ అంటూ బీఆర్ఎస్ యాత్రలతో యాగీ చేస్తోంది. దీంతో హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై కేసీఆర్ వాదనకు వ్యతిరేకంగా హరీష్ , కేటీఆర్ ఉద్యమం చేపడుతున్నారని   బీఆర్ఎస్ పై  కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదేక్ర‌మంలో గ‌తంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో…ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… కేసీఆర్ కు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఇప్పటికే పలుచోట్ల హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తం అవుతుండగా.. మూసీ సుందరరీకరణ కోసం మరికొన్ని ఇండ్లను కూల్చివేతలకు  హైడ్రా సిద్ధమవ్వడంతో రచ్చ పతాక స్థాయికి చేరుకుంది.  మూసీ ప‌రిధిలోని ఇండ్ల‌కు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే   బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ యాత్ర చేపట్టింది. గోదావరి నీళ్ళేమోకానీ ప్రజల రక్తం పారుతున్నది అంటూ హరీష్ రావు హైడ్రా కూల్చివేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలోని పేద‌ల ఇల్లు కూల్చాలంటే మామ్మ‌ల్ని దాటుకొని వెళ్లాల‌ని హ‌రీశ్ రావు సవాల్ విసిరారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీలు బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్ సైతం మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జ‌ల ఇండ్ల‌ను కూల్చాలంటే ముందు మాపై బుల్డోజ‌ర్లు ఎక్కాల‌ని ప్రకటనలు చేశారు. బీఆర్ ఎస్‌, బీజేపీలు యూట‌ర్న్ తీసుకొని హైడ్రా కూల్చివేతలు రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రయ‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. స్థానిక ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు ఆ రెండు పార్టీలు పోటీ ప‌డుతున్నాయి.

 ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం హైడ్రా కూల్చివేతలపై అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్ళను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయించి ఆ తర్వాత ఖాళీ చేయించాల్సిందన్నారు. హైడ్రా అధికారులు మాత్రం .. మూసీ ప‌రివాహ‌క ప్రాంతం నుంచి ఎవ‌రినీ బ‌ల‌వంతంగా పంపించ‌డం లేద‌ని, అంద‌రితో మాట్లాడి, ఒప్పించి, సుర‌క్షితంగా త‌ర‌లిస్తున్నామ‌ని చెప్పారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో హైడ్రా వ‌ల్ల ఇల్లు కోల్పోయిన ప్ర‌తీ ఒక్క‌రికి డ‌బుల్ బెడ్‌రూం ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ, బీఆర్ ఎస్‌, బీజేపీ నేత‌లు మాత్రం అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పోటీప‌డుతూ రేవంత్ టార్గెట్ గా విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. రేవంత్ సైతం ఎట్టిప‌రిస్థితుల్లోనూ హైడ్రా విష‌యంలో త‌గ్గేది లేద‌ని తేల్చ‌చెబుతుండ‌టంతో రాబోయేకాలంలో హైడ్రా రాజ‌కీయం ఎటు మ‌లుపు తిరుగుతుందోన‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.