రేవంత్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్.!

Publish Date:Sep 2, 2026

Advertisement

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది.  బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,   6 గ్యారంటీల  అమలులో రేవంత్  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు. 

రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో  రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్  ఆ  చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద   ఏటా ఎకరాకు అందిస్తామన్న  15 వేల రూపాయల  సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది.  అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన   12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది.  2 లక్షల రూపాయల  రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. 

యువత,  విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది.  నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన   4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన  5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల  కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే..  మహిళలకు ఇస్తామన్న నెలకు  2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.  

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,  తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని  విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

[BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics, 
Telugu One]

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.