బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్!

Publish Date:Apr 23, 2025

Advertisement

మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు.

పార్టీల వారీగా చూసుకుంటే.. ఎంఐఎంకి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారితో పాటు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో.. ఎంఐఎం బలం 49కి చేరింది. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బరిలో దిగిన బీజేపీకి.. నలుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే.. బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లని మినహాయిస్తే.. మరో 19 మంది కార్పొరేటర్లతో కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు దక్కించుకోవాలి. కాబట్టి.. ఎంఐఎం అయినా, బీజేపీ అయినా.. ఇతర పార్టీల ఓటర్లపై ఆధారపడటం తప్ప మరో అవకాశం లేదు.

ఎంఐఎంకు మిత్రపక్షంగా కొనసాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి.. ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు, మరో ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి.. మొత్తం 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్ దగ్గర పార్టీ ఫిరాయించిన వారు మినహా 9 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి  24 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల.. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఓటర్లను కలిసి వారి ఓట్లను దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది  బీజేపీ. అయితే అక్కడే బీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనొద్దని.. తమ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులను ఆదేశిస్తూ విప్ జారీ చేసింది.

బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోఉన్న కార్పొరేటర్లను ఏదో రకంగా తమవైపు తిప్పుకోవాలనుకున్న బీజేపీ లెక్కలకు.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బేననే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎందుకంటే గులాబీపార్టీకి ఇప్పుడు ఎంఐఎంతో మిత్రుత్వం లేదు. బీజేపీతో తమకు అసలే పడదని బీఆర్ఎస్ నేతలు చెబుతుం టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు పోలింగ్‌లో పాల్గొంటే అటు ఎంఐఎం గెలిచినా, ఇటు బీజేపీ గెలిచినా బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్సే. మజ్లిస్ పార్టీ గెలిస్తే.. ఇంకా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. అదే బీజేపీ గెలిస్తే కారు, కమలం ఒకటేనని కాంగ్రెస్ వాయించేస్తుంది.   అందుకే పోలింగ్‌కు దూరంగా ఉంటే.. రాజకీయంగా ఎలాంటి బాధ ఉండదనే ఆలోచ నతోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎంఐఎంని సునాయాసంగా గట్టెక్కేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.