బీఆర్‌ఎస్ ఏ పార్టీతోనూ కలవదు : కేటీఆర్
Publish Date:Jul 27, 2025
Advertisement
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎవరితో కలిసి ప్రసేక్తే లేదు. తెలంగాణ ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్‌ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయ్యింది అంటూ ఆయన తెలిపారు. ఆ కష్టకాలంలో కూడా రైతుబంధు ఆగలేదు. 24 గంటల ఉచిత విద్యుత్ ఆగలేదు.. కళ్యాణ లక్ష్మి , కెసిఆర్ కిట్ వంటి పథకాలను ఆపలేదు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆయన తెలిపారు
http://www.teluguone.com/news/content/brs-25-202878.html





