పెనుగొండ ఎమ్మెల్యేకు సోద‌రుల బెడ‌ద‌

Publish Date:Jul 10, 2022

Advertisement

రాజ‌కీయాల్లో కాలం క‌లిసివ‌స్తే బాగా అదృష్టం ప‌ట్టిన‌ట్టే. కానీ తాను స్వ‌యంగా ఎలాంటి పొర‌పాట్లూ చేయ‌క‌పోయినా ఆయ‌న పేరు అడ్డు పెట్టుకుని సోద‌రులు ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటే మాత్రం చెడ్డ‌పేరు వ‌చ్చేది ఆ నాయ‌కుడికే గాని త‌మ్ముళ్లకు కాదు. వాళ్లు తేలిగ్గా త‌ప్పించు కుంటారు. దేశంలో రాజ‌కీయ‌ నాయ‌కులు చాలామందికి బంధువులు, సోద‌రుల‌తోనే ఇబ్బందులు వుంటాయి. మ‌నోడు ఎమ్మెల్యే, మంత్రి అని చెప్పుకుని నియోజ‌క‌వ‌ర్గంలో అంద‌రి మీదా పెత్తనం చెలాయించ‌డం చూస్తూనే వుంటాం. వింటూనే వుంటాం. ఇది ఒక్కోసారి స‌ద‌రు మంత్రి లేదా ఎమ్మెల్యేకు భ‌రించ‌లేని భార‌మ‌యి ప‌దవికే ఎస‌రు పెడుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పెనుగొండ రాజ‌కీయాల్లో  మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంక‌ర నారాయ‌ణ ప‌రిస్థితి సరిగ్గా ఇలాంటిదే.

పెనుగొండ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణది పెనుగొండ నియోజక వర్గం. ఇక్కడ తాను మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా.. వెంటనే అదృష్టం కలసి వచ్చింది. 2019 జగన్ మొదటి క్యాబినెట్ విస్తరణలో ఛాన్స్ కొట్టేసారు. సామాజిక సమీకరణాలు అప్పట్లో ఆయనకు బాగా కలసి వచ్చాయి. ఎమ్మెల్యే టికెట్ రాక ముందు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన శంకర్ నారాయణపై పెద్దగా విమర్శలు లేవు. అయితే మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి జిల్లాలో వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. అధిష్టానం వరకు పిర్యాదులు వెళ్లేలా వ్యవహరించారు.
అసలు ఆయన అలా కావడానికి ఆయన ప్రత్యక్ష కారణం కాదు. అంతా ఆయన సోదరులే చేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. పార్టీ నాయకుల కోపం, ఆగ్రహం అంతా శంకర్ నారాయణ సోదరులపైనే అంటూ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

శంకర్ నారాయణకు ఇద్దరు సోదరులు  రవి, మల్లికార్జున్. మంత్రి అయ్యాక శంకర్ నారాయణ పూర్తిగా బిజీ బిజీగా గడిపేవారు. దీంతో నియోజకవర్గ స్థాయి పెత్తనం సోదరుల చేతిలోకి వెళ్లింది. చేతిలో అధికారం ఉంది కదా అని రవి మరింత దూకుడుగా వెళ్లేవారట. రాజకీయ కార్యక్రమాల్లోనే కాకుండా అధికారిక కార్యక్రమాలలో సైతం జోక్యం చేసుకొవ‌డం ఎక్కువ‌యింది. ఆ విధంగా నియోజకవర్గంలో మొత్తం పట్టుసాధించార‌ని కూడా చెబుతుంటారు. పెనుకొండలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పని జరగాలన్నా శంకర నారాయణ సోదరులకు తెలియాల్సిందే. ఈ వైఖరి కొత్తలో బాగానే ఉన్నా రాను రాను శ్రుతిమించినట్టు చెబుతున్నారు. ఫలితంగా వైసీపీ లోకల్ లీడర్సే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది.

మంత్రిగా శంకర్ నారాయణ కొనసాగినంత కాలం పార్టీ నేతలు., కార్యకర్తలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మంత్రివర్గం నుంచి శంకర్ నారాయణను తప్పించిన తరువాత వ్యతిరేకులంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ శంకర్ నారాయణ అన్నదమ్ముల్లో మార్పు రాలేదని టాక్. తాజాగా ఒక ఉద్యోగిని విషయంలో మాజీ మంత్రి సోదరులు వ్యవహరించిన విధానం వివాదాస్పదంగా మారింది. పెనుకొండ ఎంపిడిఓ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని బదిలీపై పరిగి మండలానికి వచ్చారు.

జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోతుంటే, అక్కడి ఎంపీడీవో షాక్ ఇచ్చారట. ముందుగా వెళ్లి శంకర నారాయణ సోదరుల పర్మిషన్ తీసుకోవాలని.. ఆ తర్వాత డ్యూటీలో చేరాలని చెప్పారని సమాచారం. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఆ మహిళా ఉద్యోగి భర్త కూడా వైసీపీ నాయకుడే. ఆయన శంకర నారాయణ వ్యతిరేక వర్గం కావడంతోనే అలా చేశారని నియోజవర్గంలో వార్త గుప్పుమంది. ఆ వర్గ పోరు కారణంగా ఆ ఉద్యోగినికి అక్కడ పోస్టింగ్ క్యాన్సిల్ చేసి మడకశిర పంపేశార‌ని స‌మాచారం.

By
en-us Political News

  
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.