పెళ్లి చూపుల నాడు బాగున్నాడు... తీరా పెళ్లి పీటల మీదకు వచ్చే సరికి నచ్చలేదు!
Publish Date:Jul 9, 2022
Advertisement
చిన్న పిల్లలకు కనిపించిన ప్రతీదీ నచ్చేస్తుంది. ఆ తరువాత కొద్ది సేపటికే అది కాదు ఇంకోటి అంటూ నిముషానికోసారి వారి ఇష్టాలు మారిపోతుంటాయి. వారి దృష్టి చెదిరిపోతుంటుంది. అది సహజం. పిల్లల్లో చపలత్వం ఎక్కువ ఉంటుంది. వారి ఇష్టాఇష్టాలు ఎక్కువ సేపు స్థిరంగా ఉండవు. కానీ వయసు వచ్చి, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి పెళ్లీడుకు వచ్చిన యువతలో అటువంటి చపలత్వం పెద్దగా కనిపించదు. కానీ యూపీకి చెందిన నీతా యాదవ్ లో మాత్రం మానసిక స్థిరత్వం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి చూపుల్లో నచ్చిన వరుడిని తీరా పెళ్లి పీటల మీద నచ్చలేదంటూ తిరస్కరించింది. పెళ్లిచూపుల్లో వరుడు నల్లగా అనిపించలేదట.. కానీ ఏడడుగులు వేస్తుంటే దగ్గర నుంచి చూసి ఇంత నల్లగా ఉన్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనంటూ భీష్మించింది. ఈ సంఘటనతో వరుడి తరఫువారే కాదు వధువు తరఫువారూ నిర్ఘాంత పోయారు. నీతా యాదవ్ ను బతిమలాడారు, బుజ్జగించారు. ఎంత చెప్పినా ఆమె తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ నల్లగా ఉన్నాడు... అతడిని పెళ్లి చేసుకోనుగాక చేసుకోను అంటూ మొండి కేసింది. చివరికి చేసేదేం లేక పెళ్లి రద్దు చేశారు. ఏడడుగుల బంధంతో ఒక్కటి కావలసిన వారు రెండడుగులే వేసి విడిపోయారు. అయితే పెళ్లి కుమారుడి తరఫు వారు ఊరుకోలేదు. పెళ్లికి తరలి వచ్చిన తమ ఆబోరు తీశారంటూ పెళ్లి కూతురి తరఫు వారిపై కేసు పెట్టారు. పెళ్లి కూతురికి తాము ఇచ్చిన నగలు, బహుమతులు వెనక్కు ఇచ్చేయడమే కాకుండా.. నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరుతున్నారు. కలకలం రేపింది.
http://www.teluguone.com/news/content/bride-rejects-bride-groom-saying-he-is-black-just-miniuts-before-marriage-25-139382.html





