బ్రహ్మానందాన్ని పూరీ పక్కన పెట్టాడా?
Publish Date:Feb 2, 2015
Advertisement
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా టైటిల్ 'టెంపర్' పేరు వింటేనే అదొక యాక్షన్ సినిమా అని అర్ధమవుతోంది. అందులో తను చాలా కసితో పనిచేశానని యన్టీఆర్ చెప్పారు. కానీ ఎంత కసిగా చేసినా ఇప్పుడు సినిమాలలో కామెడీ, అందునా బ్రహ్మానందం లేకపోతే అది ఎంత గొప్పగా ఉన్న ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే అందరు దర్శకులు తమ సినిమాలలో కామెడీకి చాల ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ‘టెంపర్’లో బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరోగా పేరు పొందిన యన్టీఆర్ చేతనే కామెడీ కూడా చేయించేస్తున్నాడు పూరి. యన్టీఆర్ యాక్షన్ హీరో అయినప్పటికీ అతను కూడా మంచి కామెడీ చేయగలదని తన ‘అదుర్స్’ సినిమాలో చూపించాడు. బహుశః అందుకే దర్శకుడు పూరీ జగన్నాథ్ పూర్తిగా యన్టీఆర్ మీదనే ఆధారపడి యాక్షన్, కామెడీ రెండూ కూడా చేయించేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ అదుర్స్ సినిమాలో ఒక్క యన్టీఆర్ వల్లనే కామెడీ పండలేదు. బంగారానికయినా గోడ చేర్పు అవసరమన్నట్లుగా యన్టీఆర్ పక్కన బ్రహ్మానందం అతని గురువుగారిగా వేయడంతో వారి కామెడీ అద్భుతంగా పండింది. ఇక వారిరువురికీ యం.యస్. నారాయణ, రఘుబాబు వంటి వారందరూ చేరి అత్యద్భుతంగా కామెడీ పండించారు. నిజానికి ఆ సినిమాకి అటువంటి గొప్ప కామెడీ ట్రీట్ మెంట్ ఇవ్వకపోయి ఉంటే అదొక పాత మూస సినిమాగా తేలిపోయి ఉండేది. మరి కామెడీకి దానికి మారుపేరుగా ఉన్న బ్రహ్మానందానికీ ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసీ కూడా మరి పూరీ జగన్నాథ్ యన్టీఆర్ తో ఎందుకు ఆడుకొంటున్నాడో తెలియదు. కానీ ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే ఇరువురికీ చెడ్డ పేరే వస్తుంది. పైగా ఫ్లాపులతో సతమతమవుతున్న వారిరువురికీ చాలా పెద్ద దెబ్బే అవుతుందని సినీ పండితులు అభిప్రాయ పడుతున్నారు. ఇక బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరో చేత కామెడీ చేయించి అభాసుపాలయితే సినీ పరిశ్రమలో అది మరీ కామెడీగా ఉంటుంది. బ్రహ్మానందానికి డేట్స్ కుదరకనో, లేకపోతే ఆయన అడిగినంతా ముట్టజెప్పకపోవడం వలననో లేక మరే ఇతర కారణాల చేతనో ఆయనని పూరీ పక్కన బెట్టి ఉండవచ్చును. కానీ ఆయనకీ లక్కీ స్టార్ అని చెప్పుకొనే ఆలీని కూడా ఎందుకో పక్కనబెట్టేసారు ఈసారి. మరి ఇదంతా ఎవరి ‘టెంపర్’ వల్ల జరుగుతోందో తెలియదు కానీ మళ్ళీ పూరీ-బ్రహ్మానందం-ఆలీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ప్చ్!
http://www.teluguone.com/news/content/brahmanandam-32-42723.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





