పుత్రిక రాజ‌కీయ అరంగేట‌గ్రం.. గ్రౌండ్ ప్రిపరేషన్ లో బొత్స!

Publish Date:Dec 8, 2025

Advertisement

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నాత‌నదైన రాజ‌కీయం చేయ‌డంలో ఆరితేరిన వార‌న్న పేరుంది ఆయనకు.  విజయనగరం రాజ‌కీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు.  ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి  సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.   ఈ క్రమంలోనే  తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు.  తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్‌ వర్క్ పెద్ద ఎత్తున‌ జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష  చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్‌ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స  అనూష‌ ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వ‌ర‌లోనే  ఆమె రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది. 

చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్‌ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక‌ నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి త‌న‌దైన శైలిలో స్పందిస్తున్నార‌ట‌. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్‌ కెరీర్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. 

తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల‌ స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్‌ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మ‌రో రాజకీయ వారసత్వం  ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.

By
en-us Political News

  
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.