చీపురుపల్లిలో బొత్సకు ఎదురుగాలి.. బలంగా పుంజుకున్న కళా వెంకటరావు!

Publish Date:Apr 19, 2024

Advertisement

మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు.

ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ

డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.