కాగల కార్యాన్ని బోండా ఉమ తీర్చేస్తున్నారుగా?

Publish Date:Jul 27, 2026

Advertisement

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి  తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.  ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు..  ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.  

గుంటూరులో జరిగిన  ముద్రగడ సంస్మరణ సభ వేదికగా..  బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది.   రాష్ట్ర జనాభాలో   25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ,  కాపుల ఆవేదనను,  డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ  ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు  

మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు.  తెలుగుదేశం   అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.    

ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది.  

రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది.

2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను  మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో  రాధా  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా..  తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా  ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు.  

ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు. 

Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.