ఒకవైపు ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది. సోమవారం (ఆగస్టు 3) సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో జరిగిన రంగం లో మాతంగి స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి రాష్ట్రం భారీ వర్షాలు, వరదల ముప్పు ముంగిట ఉందని చెప్పింది.
వాతావరణ శాఖ.. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో సూపర్ ఎల్ నినో ఏర్పడిందనీ, దీని ప్రభావంతో వర్షాకాలం సాధారణం కంటే చాలా చాలా తక్కువ వర్షపాతం నమోదౌతుందనీ శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా చెబుతుంటే.. ఆ శాస్త్రీయంగా వేసిన అంచనాలకు భిన్నంగా అమ్మవారి భవిష్యవాణి ఉంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసి, భయంకరమైన భారీ వరదలు సంభవిస్తాయని భవిష్యవాణి కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పదని పేర్కొంది. వర్షాలతో పాటు ఈ ఏడాది భారీ అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని భవిష్యవాణి పేర్కొంది. ధర్మాన్ని పాటిస్తూ భక్తితో నడుచుకుంటే ఎంతటి ఆపద వచ్చినా భక్తులను కాపాడుకుంటానని అమ్మవారు అభయమిచ్చినట్లు స్వర్ణలత వినిపించిన భవిష్యవాణి పేర్కొంది. 6 నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ఠ చేయకుంటే పెనుముప్ప తప్పదని హెచ్చరించింది. శాస్త్ర విజ్ణానం అంచనాలు నిజమై లోటు వర్షపాతంలో కరవు చ్ఛాయలు అలముకుంటాయా? అమ్మవారి భవిష్యవాణి చెప్పినట్లు కుండపోత వర్షాలు ముంచెత్తుతాయా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ సమాజాంలో జోరుగా సాగుతోంది.
Telangana Heavy Rains Alert, Matangi Swarnalatha Bhavishyavani, Secunderabad Mahankali Bonalu, Telangana Floods Warning, IMD Weather Forecast Telangana
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bonalu-rangam-predictions-36-227869.html
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో పుట్టి SRH నెట్ బౌలర్‌గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్‌లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయంతో బుమ్రా దూరం. ఆయన స్థానంలో 104 రంజీ వికెట్ల వీరుడు జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికై చరిత్ర సృష్టించాడు. టీమిండియా టెస్టు స్క్వాడ్ వివరాలు ఇవే!
ఐసీసీ చైర్మన్ జై షా టాంజానియాలో తొలి ఐసీసీ ఆమోదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టాంజానియా క్రికెట్ అరీనాను ప్రారంభించారు. ఆఫ్రికాలో క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది