మరాఠీలకు ప్రాంతీయవాదం అంటే మమకారం 

Publish Date:May 4, 2023

Advertisement

జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల మహరాష్ట్ర ఔరంగా బాద్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రచారం కూడా భారీగానే  కల్పించింది బీఆర్ఎస్. మరాఠా పత్రికలకు లక్షలాది రూపాయల యాడ్స్, జర్నలిస్ట్ లకు రాచమర్యాదలు చేసింది. ఈ వార్త సేకరించడానికి వచ్చే రిపోర్టర్లలో కొందరికి ఫ్లయిట్ ఖర్చులు కూడా బీఆర్ఎస్ భరించింది. వారికి రాచమర్యాదలు చేసింది. ఇటీవలె మహరాష్ట్రలో బోకర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికలో భారీ ఓటమిని చవి చూశారు. డైరెక్టర్ పదవులను ఆశించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదిలోనే భంగపడ్డారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది.  మొత్తం 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 13, బీజేపీ 3, ఎన్సీపీ 2 గెలుచుకుంది. ఈ ఓటమికి బలమైన కారణం ఒకటుంది. ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీభాయ్    పుట్టిన గడ్డ  అది.  వందల సంవత్సరాల నుంచి మరాఠీల రక్తం దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఉన్నట్లు రుజువయ్యింది. చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. హిందుత్వవాదంను సమర్ధించే పార్టీలు అక్కడ మనుగడ సాగిస్తాయని లోకోక్తి. శివసేన అయినా బీజేపీ అయినా అధికారాన్ని పంచుకున్నాయి. కానీ ప్రాంతీయేతర పార్టీలను మరాఠా గడ్డ మీద కాలు మోపనీయలేదు.  మరాఠీలు మాత్రమే ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రేస్ పార్టీలో పదవులు అనుభవించిన శరద్ పవార్ మరాఠీయుడు. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  నేతగా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మరాఠీయుడు. భోకర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడానికి అశోక్ చవాన్ ముఖ్య కారణం. మరాఠా గడ్డ మీద బీఆర్ఎస్ ఎంట్రీని అతను ఏ మాత్రం సహించలేకపోయారు. మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ఏమిటి? మరాఠీలు పునరాలించుకోవాలని అశోక్ చవాన్ స్థానికులను అనేక మీటింగ్స్ లో ప్రశ్నించారు. ఒక సారి బీఆర్ఎస్ ప్రవేశిస్తే  మన ప్రాంతం ప్రమాదంలో పడినట్టేనని ప్రచారం చేశారు. ఈ మేరకు పావులు కూడా కదిపారు. ఒక్క వోటుకు 10 వేల రూపాయల పెట్టి కొనుగోలు చేసినట్టు బీఆర్ ఎస్ పై ఆరోపణ ఉంది. 
భోకర్  మార్కెట్ కమిటీ  ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. భోకర్ లో ప్రాబల్యం ఉన్న నాగ్ నాథ్ ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. నాగ్ నాథ్ ను కేసీఆర్ ఓదార్చారు. వెంటనే మరాఠా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మొదటి ఓటమి విజయానికి తొలి మెట్టు కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  నాయకులు జిల్లా పరిషత్ , మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  బీఆర్ఎస్ నేతలు  పెద్ద పెద్ద కలలే కన్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీలను అధికారంలో తీసుకురావడానికి బీఆర్ఎస్ అధినేత కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా పర్యటించాలని, తాను ప్రధాని కావాలని ఉవ్వీళ్లూరారు.  ఎవరూ ఊహించనీ విధంగా భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ తొలి సారి  పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మహరాష్ట్రలోని  బోకర్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భోకర్ తాలూకాలోని నంద, రాతి, కిని, పలాజ్ దివిసి గ్రామాలు నిర్మల్ తదితర జిల్లా సరిహద్దులను పంచుకుంటున్నాయి. భోకర్ భైంసా పట్టణానికి  35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాల్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఆవాసమున్నారు.  సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. భోకర్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ ఓటమితో కలత చెందారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను మహరాష్ట్రలో అమలు చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికలో వర్కవుట్ కాలేదు. 

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.