టీమిండియా కోచ్ పదవికి ఎందుకంత క్రేజ్..!
Publish Date:Jun 3, 2016
Advertisement
భారత క్రికెట్ కోచ్‌గా పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. ప్రస్తుత కోచ్ డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో పాటు కోచ్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి కాంట్రాక్ట్ కూడా ముగియడంతో ఇఫ్పుడు అందరి దృష్టి టీమిండియా కోచ్ పదవిపై పడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రికెట్ దిగ్గజాలు టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అసలు టీమిండియా కోచ్ పదవికి ఎందుకంత క్రేజ్ వచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ధనిక క్రికెట్ బోర్డు. ఇక్కడ ఆటగాళ్లు ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతారు. అంతేనా స్పెషల్ అలవెన్స్‌లు, బోనస్‌లు ఇలా బాగా గిట్టుబాటవుతుంది. ఆటగాళ్లకే అంతుంటే మరి జట్టును వెనుక నుంచి నడిపించే కోచ్‌కు ఏ రేంజ్‌లో పారితోషకాలు అందుతాయో చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు క్రికెట్ ప్రపంచంలో తాను ఏది అంటే అది అన్నట్టు శాసిస్తున్న బీసీసీఐ కోచ్ కూడా ప్రపంచ క్రికెట్‌పై అలాగే ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. గతంలో క్రికెటర్లకైనా, కోచ్‌లకైనా మ్యాచ్ ఫీజుతో పాటు బీసీసీఐ ఇచ్చే వేతనం, ఇతర ప్రోత్సాహకాలు మాత్రమే లభించేవి. అయితే రాను రాను క్రికెట్‌కు ప్రజాధరణ పెరిగిపోతుండటంతో క్రికెటర్లు, కోచ్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్నారు. ఇలా వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో వచ్చిపడుతున్నాయి. మరి ఇలాంటి కామధేనువును తమ సొంతం చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే టీమిండియా కోచ్ పదవికి అంత క్రేజ్. ఇన్ని లాభాలు ఉన్నా టీమిండియా కోచ్‌గా వ్యవహరించడం అంత తేలిక కాదు. ఎందుకంటే భారత జట్టు గెలిచినా..ఓడినా బాధ్యత కోచ్‌దే. గెలిస్తే సత్కారాలు..ఓడితే ఛీత్కారాలు కూడా అలాగే ఉంటాయి. ఈ మాటను ఆసీస్ లెజండ్ స్టీవ్ వా అంతటి వ్యక్తే అంగీకరించాడు. టీమిండియాకు కోచ్‌గా వస్తారా? అని స్టీవ్‌వా అను అక్కడి మీడియా ప్రశ్నిస్తే..భారత జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి..వాటిని తట్టుకోవడం కష్టం. అంత సాహసం నేను చేయలేనేమో అంటూ సమాధానం ఇచ్చాడాయన. ఏది ఏమైనా మాజీ క్రికెటర్లు మాత్రం ఈ బంపర్ ఆఫర్‌ను వదుకోకూడదని తమ తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/board-of-control-for-cricket-in-india-45-61503.html





