Publish Date:Jan 15, 2026
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాల వేళ సర్వత్రా ఉత్కంఠ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు నేడు శుక్రవారం (జనవరి 16) వెలువడనున్నాయి. గురువారం (జనవరి 16) బీఎసంసీకి జరిగిన ఎన్నికలలో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. బీఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ ఫలిలాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అన్నిటికీ మించి దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలి సారిగా ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రేలు ఈ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీఎంసీ ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ' ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
బీఎంసీతో పాటుగా గురువారం (జనవరి 15) మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా శుక్రవారమే (జనవరి 16) విడుదల కానున్నాయి. కాగా.. పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో మునిసిపల్ ఎన్నికలలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి. జాతీయ స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు 'పవార్ ఫ్యామిలీ' ఒక్కటవ్వడం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నిటికీ మించి ఈ మునిసిపోల్స్ ను పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా అభివర్ణిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు గురువారం (జనవరి 15) పోలింగ్ జరిగింది పోలింగ్ జరిగింది. ఒక్క బీఎంసీలోనే 227 వార్డులు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bnc-election-results-today-39-212569.html
బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు.
పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
సింథటిక్ నెయ్యితో స్వామివారికి లడ్డూలు చేసి పెట్టిన పాపం ఊరకే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.