జెండా జనసేన.. అజెండా వైసీపీ.. బాలినేని రంగు బయటపడిందా?

Publish Date:Aug 12, 2026

Advertisement

కూటమి పార్టీల మధ్య.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య ఐక్యతకు విఘాతం కలిగేలా ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన ఒంగోలు నేతల మధ్య నెలకొన్న విభేదాలు రోడ్డున పడి మీడియా సమావేశంలో పరస్పరం విమర్శలు, ఇరోపణలూ చేసుకునే వరకూ వెళ్లింది. ఈ విషయంలో  ఇరు పార్టీల అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని ఇరువురు నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. అసలు పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణం ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.  

ముఖ్యంగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు నచ్చచెప్పడంతో.. అంగీకరించి సర్దుకు పోయారు. 

అయితే తాజాగా బాలినేని జనార్దర్ రెడ్డి    ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు అండదండలతోనే భూ, ఇసుక, రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.   జనసేన   మద్దతు, ఓట్లతోనే దామచర్ల గెలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.  

ఈ ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కూడా ఘాటుగా రియాక్టయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి  ఫస్ట్రేషన్‌తో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.   గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని, ఆయన కుమారుడు కలిసి సిండికేట్ మద్యం వ్యాపారాలు నడుపుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తనపై, తన అనుచరులపై ఏకంగా 79 కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని గుర్తుచేశారు. తనను రాజకీయంగా ఎదిరించే ధైర్యం లేక,  బాలినేని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు ప్రజలు దామచర్ల జనార్ధన్ రావును  34వేల026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన సంగతిని గుర్తు చేశారు.  మైనింగ్ సహా అన్ని అంశాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు కూటమి నాయకులలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు పట్ల హాట్ హాట్ చర్చ జరుగుతోంది. బాలినేని విమర్శలు, సవాళ్లు చూస్తుంటే.. పేరుకు ఆయన జనసేన జండా పట్టుకున్న అజెండా మాత్రం వైసీపీయే అన్నట్లుగా ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య వివాదాలు సృష్టించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే వ్యూహంతో బాలినేని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.   

Balineni versus Damacharla, Prakasham, Politics, Janasena Janda, YCP, Ajenda, TeluguOne 

By
en-us Political News

  
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.