సంకట స్థితిలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు

Publish Date:Mar 15, 2025

Advertisement

మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ నేతలకు ప్రజలనుంచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.  

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ డీలిమిటేషన్, త్రిభాషా సూత్రాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది పార్టీలను కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిథులు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాయకులను చెన్నై వేదికగా ఈ నెల 22న జరిగే అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. చెన్నై వేదికగా డీఎంకే నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో కేంద్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలకు, కసరత్తుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుంది.

డీఎంకే నేతలు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. త్రిభాషా సూత్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులలో, పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నేతలందరిలో ఏకాభిప్రాయమే వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా డీలిమిటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగా విమర్శించారు.  దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలంతా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టం ఉన్నా లేకున్నా డీలిమిటేషన్ కు అనుకూలంగా తప్ప వ్యతిరేకంగా నోరెత్తలేని సంక్లిష్ట స్థితిలో వారు మిగిలిపోయారు. ఎందుకంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నోరెత్తలేరు.. అలాగని దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. డిలిమిటేషన్ పేరిట కాంగ్రెస్, డీఎంకేలు విభజన రాజకీయాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి పడ్డారు. దక్షిణాది బీజేపీ నేతలు డిలిమిటేషన్ పై ఈ విమర్శ మాత్రమే చేయగలరనీ, అయితే ఇదేమీ వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  దక్షిణాదిలో కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఒకింత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డిమిలిటేషన్ వ్యవహారం తెలంగాణలో కూడా ఆ పార్టీ పరిస్థితిని మళ్లీ మెదటికి తీసుకువస్తుందన్న భావన రాజకీయవర్గాలలోనే కాదు, బీజేపీ శ్రేణులలో సైతం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.