తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇదేనా?.. ఆ పార్టీ నేతల ధీమా ఉత్తిదేనా?

Publish Date:Jul 13, 2022

Advertisement

తెలంగాణలో బీజేపీ ఆర్భాటమంతా పైన పటారం లోన లొటారమేనా? తెలంగాణలో అధికారం ఖాయం అంటూ ఆ పార్టీ రాష్ట్ర నేతలు చేస్తున్న ప్రసంగాలకూ, వారికి వత్తాసుగా గొంతు కలుపుతున్న బీజేపీ అగ్రనేతల ప్రసంగాలకూ అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవా? ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం మాట అటుంచి కనీసం పది, పన్నెండు అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించడమే గొప్ప విషయమా? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాలే కాదు.. కాషాయ శ్రేణులు కూడా ఔననే అంటున్నాయి.

వాస్తవానికి ఇప్పటికిప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగానా బీజేపీ రాష్ట్రంలో పది నుంచి పన్నెండు స్థానాలలో విజయం సాధించడమే గొప్ప విషయంగా ఆ పార్టీ శ్రేణులే ఆఫ్ ది రికార్డ్ చేబుతున్నాయి. ఈ విషయం పార్టీ అధిష్ఘానానికి కూడా తెలుసునని అంటున్నాయి. వాస్తవానికి బీజేపీలో గ్రూపులు అసంఖ్యాకంగా ఉన్నాయనీ, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయనీ అంటున్నారు. పార్టీ రాష్ట్ర నేతలలో ఒకరితో ఒకరికి పడదనీ, ఎవరిదారి వారిదేగా వారి తీరు ఉందనీ పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే, గ్రూపులు, అంతర్గత విభేదాలు, అసమ్మతి విషయంలో రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసుపోదని చెబుతున్నారు. గ్రామీణ స్థాయిలో బీజేపీకి క్యాడరే లేదన్న విషయాన్ని కూడా వారీ సందర్భంగా చెబుతున్నారు.  హైదరాబాద్ వేదికగా జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అంతా బాగుందన్న బిల్డప్ ఇచ్చినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెబుతున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాలలో మాజీ మంత్రి ఈటలకు సముచిత స్థానం ఇచ్చినట్లు కనిపిస్తున్నా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఈటలకు మధ్య పూడ్యలేనంతగా అగాధం ఉందని అంటున్నారు. పేరుకు చేరికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దాని బాధ్యతలు ఈటలకు అప్పగించినా.. ఆ దిశగా ఈటల అడుగు ముందుకు వేయడానికి వీల్లేనంతగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ ఇలా ఎవరికి వారు సొంత గ్రూపును మెయిన్ టైన్ చేస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరి బీజేపీ అడుగులు తెలంగాణలో గడపదాటే పరిస్థితిలో లేకపోయినా.. మాటలు ఎందుకు కోటలు దాటుతున్నాయి.

రాష్ట్ర నాయకులు చెబుతున్నదానికి పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు తందాన అంటోంది అంటే.. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత తన వ్యూహకర్త పీకే బృందంతో చేయించిన సర్వేలలో కానీ, బీజేపీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిశీలనలో కానీ తేలిందేమిటంటే... బీజేపీకి తెలంగాణలో అది చెప్పుకుంటున్నంత సీన్ లేదనీ, ఆ పార్టీ పది నుంచి పన్నెండు అసెంబ్లీ స్థానాలలో కూడా విజయం సాధించడం కష్టసాధ్యమేననీ, అదే సమయంలో కాంగ్రెస్ ను టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా జనం భావిస్తున్నారని. అదే సమయంలో ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా రాష్ట్రంలో తెరాస పలుకుబడి పలుచబడింది.

ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బ తీసింది.  అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. కేసీఆర్ కు రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని చేపట్టడం ఎలా అవసరమో.. కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న తన లక్ష్యం చేరుకోవడానికి బీజేపీకి కాంగ్రెస్ పుంజుకోకుండా చూడటం అంతే అవసరం. ఇక్కడే ఆ రెండు పార్టీలూ కలిసి రసవత్తర రాజకీయ డ్రామాకు తెరతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెరాస తెలంగాణలో అధికారంలో ఉంది... కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండూ కలిసి పరస్పర విమర్శలతో కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న సమాచారం ప్రజలకు దూరం చేయడంలో భాగంగా పరస్పర విమర్శల పర్వానికి తెరలేపాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అందుకే కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నట్లు కనిపించినా రాష్ట్ర రాజకీయాల గురించిన ప్రస్తావన మానేసీ జాతీయ అజెండా పాట ఎత్తుకుని నిత్యం మోడీపైనా, మోడీ సర్కార్ పైనా విమర్శలు గుప్పిస్తుంటే.. బీజేపీ ప్రజా సమస్యల మాట వదిలేసి కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన అంటూ విమర్శల పల్లవి ఎతుకుందని వారు వివరిస్తున్నారు. తమ ప్రచారార్భాటం ద్వారా తెలంగాణలో పోటీ కేవలం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యే తప్ప కాంగ్రెస్ కు అంత సీన్ లేదన్న ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు.

అందుకే ముందస్తుకు ఎన్నికలకు నేను రెడీయే అంటూ కేసీఆర్ సవాల్ విసురుతూనే... బీజేపీ అందుకు అనుమతించాలన్న షరతు పెడుతున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఎర్లీ ఎలక్షన్లకు సై అంటూనే కేసీఆర్ కు మా అనుమతెందుకు అంటూ ప్రశ్నలు గుప్పిస్తూ అసలు విషయాన్ని దాటేస్తున్నారు. ఈ మధ్యలో కాంగ్రెస్ మీడియా సమావేశాలు, టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలకు మీడియాలో పెద్ద ప్రాధాన్యత లేని పరిస్థితి. సరిగ్గా ఇదే టీఆర్ఎస్, బీజేపీలు కోరుకుంటున్నది అని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.