మునుగోడులోనూ మునక తప్పదా? కమలనాథుల్లో ఆందోళన

Publish Date:Sep 7, 2022

Advertisement

కమల వికాసం అంటూ బీజేపీ చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయి. వ్యూహాలు తల్లకిందులౌతున్నాయి. స్వల్ప వ్యవధిలో బీహార్ లో, జార్ఖండ్ లో కమల వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ప్రభుత్వాలను పడగొట్టేందుకు చేసిన ప్రయోగాలు వికటించాయి. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వమే కూలిపోయింది, జార్ఖండ్ లో బీజేపీ పరువు గంగలో కలిసి నవ్వుల పాలైంది. ఇప్పుడు ఇక మునుగోడులో ఉప ఎన్నికను బలవంతంగా తీసుకు వచ్చిన ఆ పార్టీ ఎత్తుగడ అయినా ఫలిస్తుందా అంటే పరిశీలకులు ఏమో అనే అంటున్నారు.

బీజేపీయేతర   పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కమల నాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది బిజెపి నాయకత్వం. అందులో భాగంగానే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక కు తెరలేచింది. అయితే, దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు.. ఏ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందో తెలియని పరిస్థితి.   కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ప్రయోగాలు ఫలించి అధికారం దక్కడంతో    బీహార్, ఢిల్లీ,ఝార్ఖండ్ రాష్ట్రాలలోనూ అదే ప్రయోగాన్ని అప్లై చేసిన కమలనథులకు శృంగభంగమైంది.  ముఖ్యంగా బిజెపియేతర పార్టీలు పరిపాలన సాగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చైనా సరే అధికారం దక్కించుకోవాలనే వ్యూహంతో ఇటీవల బీజేపీ పావులు కదపడం ఎక్కువైంది. ఓ రెండు రాష్ట్రాలలో (కర్నాటక, మహారాష్ట్ర)   బీజేపీ  వ్యూహాలు ఫలించి, ఎత్తుగడలు విజయవంతమైనా, ఆదే బాటలో మరో మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సర్కార్ లను కూల్చేయడానికి బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి.

బీహార్ లో అయితే ఏకంగా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం కూలిపోయింది. జార్ఖండ్, ఢిల్లీలలో ప్రయోగం వికటించడమే కాకుండా బీజేపీ పరువు గంగలో కలిసింది. పార్టీ అగ్రనాయకత్వం నవ్వుల పాలైంది.   డిల్లీ, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో  వరుసగా బీజేపీ పరువు బజారున పడటమే కాకుండా ప్రభుత్వాలు కూల్చడానికి కేంద్రం   దుష్టపన్నాగాలు పన్నుతోందన్న అప్రదిష్ట మూటగట్టుకుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు  మునుగోడు ఉపఎన్నిక ను బలవంతంగా ముందుకు తీసుకువచ్చి విజయం సాధించి ఆ తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ విజయాన్ని అలంబన చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఈ వ్యూహమైనా ఫలిస్తుందా అంటే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

ఎందుకంటే తెలంగాణలో ఇంకా చెప్పాలంటే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలంలేదనీ, మొత్తం తెరాస నుంచి కమలం గూటికి చేరి బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దిగుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టపైనే బీజేపీ పూర్తిగా ఆధారపడిందనీ అంటున్నారు. అందుకే ఇక్కడ బీజేపీ గెలుపు ఎంత మాత్రం నల్లేరుమీద బండి నడక కాదంటున్నారు. అలాగే మునుగోడు ఉప ఎన్నిక పై ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సర్వేలలోనూ కమలం పార్టీ మూడో స్థానంలో ఉండటం, ఇక్కడ తెరాస, కాంగ్రెస్ ల మధ్యే పోరు ఉంటుందని సర్వేలు తేల్చేశాయి. 

కర్ణాటకలో జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చడంలో.. మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని దింపడంలో మాత్రమే బీజేపీ వ్యూహం ఫలించింది, ప్రయోగం సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత వరుసగా బీజేపీ ప్రయోగాలు వికటించాయి, వ్యూహాలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు మునుగోడులో కూడా పరాభవం ఎదురైతే ఆ ప్రభావం తప్పని సరిగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందన్న ఆందోళన, భయం ఇప్పుడు కమలనాథుల్లో వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.