హిమాచల్, గుజరాత్ లలో మళ్లీ కమల వికాసమే.. తేల్చేసిన సర్వే

Publish Date:Nov 5, 2022

Advertisement

హిమాచల్, గుజరాత్ రాష్ట్రాలలో మరోసారి కమలమే విజయకేతనం ఎగుర వేసి అధికారాన్ని నిలబెట్టుకోనుందని సర్వే వెల్లడించేసింది. ఆ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి  ఈ నెల 12 ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీకే విజయావశాకాలున్నాయని ఇటీవల ఇండియా టీవీ-మాట్రిక్స్ నిర్వహించిన సర్వే పేర్కొంది. హిమాచల్ లో తొలి సారిగా ఆనవాయితీకి భిన్నంగా ఆ రాష్ట్రంలో వరుసగా రెండో సారి కమలం పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుందని సర్వే పేర్కొంది. అలాగే గుజరాత్ లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొంది.  

రెండు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని సర్వే పేర్కొంది. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకూ వరుసగా రెండు సార్లు ఒకే పర్టీ విజయం సాధించి అధికారం చేపట్టిన దాఖలాలు లేవు. ప్రతి సారీ ఆ రాష్ట్ర ప్రజలు అధికార పార్టీని ఓడించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. అయతే ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీని అధిగమించి హిమాచల్ లో మరో సారి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటుందని సర్వే ఫలితం చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్ల మెగ్గుతో బీజేపీ, 41 విజయం సాధిస్తుందని  ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన సర్వే వెల్లడించింది.

 ఇక కాంగ్రెస్ పాతిక స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదని సర్వే తేల్చింది. అలాగే గుజరాత్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వేలో గుజరాత్ లో మరో సారి అధికారం బీజేపీదేనని పేర్కొంది. రాష్ట్రంలో ఆ పార్టీ 125 నుంచి 135 స్థానాల వరకూ కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.  కాంగ్రెస్ 29 నుంచి 31 స్థానాలు,  ఆమ్ ఆద్మీ పార్టీ  20-24 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితం పేర్కొంది. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.