మునుగోడులో కమలానికి మూడో ప్లేసే..!

Publish Date:Aug 24, 2022

Advertisement

బీజేపీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని గిమ్మిక్కులు చేసినా మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని తాజా సర్వే తేల్చేసింది. గెలవడం అటుంచి ఆ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి ఉంటుందని కూడా పేర్కొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోటలాంటి మునుగోడులో జెండా పాతాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకా పలువురు కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుతారని ఆ పార్టీ ఆశించింది. కానీ అది జరగలేదు. పైపెచ్చు కాంగ్రెస్ బలం మునుగోడులో రాజగోపాలరెడ్డి రాజీనామా తరువాత కూడా తగ్గలేదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మునుగోడు పరిస్థితిపై ఒక రహస్య సర్వే చేయించినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండా అధిష్ఠానమే ఈ సర్వే చేయించిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆ సర్వే ఫలితాన్ని ఇటీవల ప్రియాంకా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమైన సందర్భంగా వెల్లడించినట్లు చెబుతున్నారు.  ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ చేస్తున్న హడావుడి అంతా పైపై ఆర్భాటమేనని తేలిపోయిందని చెబుతున్నారు. అయితే అంత మాత్రాన కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి కూడా లేదని సర్వే తేల్చిందని అంటున్నారు. ఆ సర్వే ప్రకారం మునుగోడులో బీజేపీ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చినా కాంగ్రెస్ కు కలిసి వచ్చేదేం  లేదనీ, ఆ పార్టీ రెండో స్థానానికి పరిమితమౌతుందని సర్వే ఫలితం వెల్లడించిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.

మునుగోడులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ స్థానంలో అధికార టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నది కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. అయితే టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య తేడా చాలా స్వల్పమని, కొంచం గట్టిగా ప్రయత్నిస్తే కాంగ్రెస్ ఈ సీటు నిలబెట్టుకునే అవకాశం ఉందనీ, సర్వే ఫలితాన్ని విశ్లేషించిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీసీలు అత్యధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక బీసీ అభ్యర్థిని నిలబెడితే ఆ తేడాను సునాయాసంగా అధిగమించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఆ పార్టీకి కలిసి వచ్చిందని అంటున్నారు.

వామపక్షాలకు మునుగోడులో దాదాపు 15వేల ఓట్లు ఉన్నాయని, అయితే నేతలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ ఓటు గంపగుత్తగా టీఆర్ఎస్ కే పడుతుందన్న నమ్మకం లేదనీ కూడా కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కనీసంలో కనీసం ఎనిమిది వేల ఓట్ల వరకూ కాంగ్రెస్ కు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మునుగోడులో బీజేపీకి క్యాడర్ లేకపోవడం, రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి కమలం గూటికి చేరినా.. ఆయన వెంట కాంగ్రెస్ క్యాడర్ వెళ్లకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.

మొత్తం మీద కాంగ్రెస్ సర్వేలోనే మునుగోడులో టీఆర్ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని తేలింది. అయితే రెండు పార్టీల మధ్యా తేడా అతి స్వల్పంగా ఉండటంతో సమష్టిగా కృషి చేస్తే సానుకూల ఫలితం ఉండే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.

By
en-us Political News

  
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
భౌగోళికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు వేర్వేరు రాష్ట్రాలుగా విడిపోయినా, భాష, సంస్కృతి పరంగా తెలుగు ప్రజల మధ్య బంధం విడదీయరానిదని అన్నారు. తెలుగు సినిమా రంగానికి ప్రజలను ఏకం చేసే అద్భుతమైన శక్తి ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.