తెలుగుదేశంతో చెలిమికి కమలం తహతహ- తెలంగాణలో పాగా కోసమేనా?

Publish Date:Aug 2, 2022

Advertisement

‘శత్రువుకు శత్రువు మిత్రుడు’.. తాజాగా ఇదే సూత్రాన్ని ఇప్పుడు బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం అమల్లో పెట్టాలని చూస్తోంది.  బీజేపీని నడిపిస్తున్న డబుల్ ఇంజిన్ షా-మోడీ ఈ మేరకు ఎత్తులు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని, తద్వారా ఎలాగైనా తెలంగాణలో పాగా వేసేందుకు డబుల్ ఇంజిన్ ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం.

తెలంగాణలో బీజేపీకి కేడర్ కొరత, తెలుగుదేశం పార్టీకి నాయకులు కొరత. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం క్యాడర్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్న సంగతి చంద్రబాబు భద్రాచలం పర్యటనతో వెల్లడైంది.

ఈ క్రమంలోనే గతంలో దూరం పెట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని దగ్గర చేర్చుకుని టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోందని జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణలో   తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఎంతగా పోరాడి గెలిచినా టీఆర్ఎస్ కు ఉన్న బలం అంతంత మాత్రమే అని, ఆ విషయం 2014 ఎన్నికల్లో ప్రస్ఫుటం అయిందనే పాయింట్ ను ఇప్పుడు బీజేపీ ఒడిసి పట్టుకుంటోందంటున్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 అసెంబ్లీ  స్థానాల్లో మాత్రమే గెలిచింది. టీడీపీ- బీజేపీ నుంచి 19 మంది ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అనంతరం ప్రత్యర్థి పార్టీల్లోని సభ్యులను ‘ఆకర్ష్’ మంత్రంతో  కేసీఆర్ లాగేసుకున్న వైనం తెలిసిందే. అలా 2014 వరకు టీఆర్ఎస్ కు వాస్తవ బలం లేదనే చెప్పాలి.  నిజానికి 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ సొంత బలం లేక జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగానే ఉంది.    టీడీపీ గెలుచుకున్న 15 మంది ఎమ్మెల్యేల్లో 13 మందిని తన పార్టీ వైపు తిప్పుకున్నారు కేసీఆర్. దీనికి బంగారు తెలంగాణ అనే సెంటిమెంట్ ను అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ప్రయోగించారు. ఇలా టీడీపీలోని బలమైన నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్ కారణంగానే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్   83   స్థానాల్లో విజయం సాధించింది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ కూడా టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
అలాంటి బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. చీటికి మాటికి కేంద్రంపైన, బీజేపీ సర్కార్ పైన విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒక పక్కన టీడీపీలోని సీనియర్లను లాగేసుకుని తెలంగాణలో ఆ పార్టీని ఒకరకంగా నిర్వీర్యం చేశారనే చెప్పాలి. దీంతో  టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసీఆర్ రాజకీయ శత్రువనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అటు బీజేపీ, ఇటు టీడీపీ ఉమ్మడి శత్రువుగానే భావిస్తాయనడంలో సందేహం లేదు.

తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే మంచి పట్టుండేది. బలమైన కేడర్ కూడా టీడీపీకి వెన్నంటి ఉండేది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల్ని తన పార్టీలోకి లాక్కుని టీడీపీ కేడర్ ను అయోమయంలోకి నెట్టేశారంటారు. టీడీపీ గనుక తెలంగాణలో మళ్లీ అడుగుపెడితే కేడర్, ఆ పార్టీ నేతలు కూడా తిరిగి వచ్చేస్తారనే అంచనాలు ఉన్నాయి. బీజేపీ కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని నమ్ముకుంది. చంద్రబాబు నాయుడిని తెలంగాణలో పునఃప్రవేశం చేయించి, వచ్చే ఎన్నికలకు వెళ్తే.. తాను అనుకున్న విజయాన్ని చేజిక్కించుకోవచ్చని మోడీ, షా ద్వయం భావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మొన్న పోలవరం ముంపు మండలాల్లో బాధితుల పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు లభించిన అఖండ స్వాగతం, జనం నుంచి వచ్చిన ఆదరణ, తర్వాత భద్రాచలంలో ఆయనకు జనం   నీరాజనం పట్టడం కూడా షా- మోడీ ద్వయం ఆలోచనా ధోరణిలో మార్పు రావడానికి కారణమంటున్నారు. చంద్రబాబును ముందు నిలబెట్టి, తెలంగాణలో తాము అనుకున్న ఫలితం సాధించొచ్చనే ప్రణాళికను అమల్లో పెట్టేందుకు వారు సమాయత్తం అయ్యారంటున్నారు.

ఈ వ్యూహంలో భాగంగానే ఈ నెల 7న రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి సంబంధించి జరిగే కీలక సమావేశానికి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ద్రౌపది ముర్ముకు టీడీపీ ఎమ్మెల్యేల ఓటు అవసరం లేకపోయినా షా ఆదేశంతో ముర్ము టీడీపీ మద్దతు కోసం విజయవాడలో సమావేశం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల స్వాతంత్ర్య సమరయోధులు, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రమావిష్కరణ సందర్భంగా చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ లో సంప్రదింపులు జరిపిన వైనం గుర్తు చేసుకుంటున్నారు.

చంద్రబాబును ప్రసన్నం చేసుకుని తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని, తద్వారా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఎత్తు వేసిందని  రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి కేసీఆర్ దూకుడును ఆపాలని, టీఆర్ఎస్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయం వ్యూహం పన్నిందంటున్నారు.

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.