బీజేపీ దక్షిణాదిలో వేళ్లూనుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా నలుగురు దక్షిణాది వారికి నామినేట్ చేసింది. ప్రముఖ తెలుగు సినీ రచయత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, అలాగే పరుగుల రాణి, ఒలింపిక్ పతక విజేత పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. రాష్ట్రపతి కోటా కనుక వీరంతా నేరుగా రాజ్యసభకు నామినేట్ అయినట్లే ఎటువంటి పోటీ ఎన్నిక ఉండదు.
తెలుగు సినిమా రచయత విజయేంద్ర ప్రసాద్ దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి. దాదాపు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ ఆయనే రచయత. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ బజరింగీ భాయీజాన్ కు కథ అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. ఇక తమిళనాడుకు చెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి పరిచయమే అవసరం లేదు. ఎన్నో సుమధుర గీతాలకు సంగీతం అందించిన లబ్ధ ప్రతిష్టుడాయన.
భారత్ కు ఒలింపిక్ మెడల్ అందించిన కేరళకు చెందని పరుగుల రాణి పీటీ ఉష. దేశంలో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన స్పోర్ట్స్ ఉమన్. అలాగే కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్. ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల ధర్మాధికారి.
వీరందరూ నామినేటెడ్ ఎంపీలే అయినా మిగిలిన రాజ్యసభ సభ్యులలాగే ఆరేళ్ల పదవీ కాలం ఉంటుంది. రాష్ట్రపతి కోటాలో వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని రాజ్యసభకు పంపిస్తూ ఉంటారు. బీజేపీ ఈ సారి ఏకంగా నలుగురు దక్షిణాది వారిని రాజ్యసభకు నామినేట్ చేసి దక్షిణాదిలో బలోపేతం కావాలన్న లక్ష్యాన్ని బలంగా చాటింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-unpresidented-priority-to-south-in-nominated-mp-posts-25-139214.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.