తెలంగాణలో బీజేపీ ఖాళీ అయిపోతోందా?

Publish Date:Oct 30, 2023

Advertisement

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి ఒక్కరొక్కరుగా అగ్రనేతలు దూరం అవుతున్నారు. తెలంగాణలో అధికారమే  తరువాయి అంటూ ఆర్భాటంగా ఇతర పార్టీల నుంచీ చేరికల  కోసం ఏకంగా  చేరికల క మిటీనే ఏర్పాటు చేసి, ఆ కమిటీ సారథ్య బాధ్యతలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటలకు అప్పగించినా కూడా.. ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేవారికి విశ్వసనీయత కలిగిన ఆప్షన్ గా కనిపించడం లేదు సరికదా ఇప్పటికే పార్టీలో ఉన్న వారు కూడా మునిగిపోయే నావను ఎలా నమ్ముకుంటాం అనుకుంటున్నారో ఏమో ఒక్కరొక్కరుగా  పార్టీని వీడుతున్నారు.

అలా వీడుతున్నట్లు ప్రకటిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీని వీడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీ నాయకులకే కాదు, ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గతంలో  తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి కారణం.. తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించాలంటే అప్పట్లో బీజేపీయే సరైన పార్టీగా కనిపించిందనీ, అప్పట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదని భావించి, శాసన సభ్యత్వాన్ని కూడా వదులుకుని రాజీనామా చేసి బీజేపీలో చేరాననీ గుర్తు చేసిన ఆయన ఇప్పుడు బీజేపీని వీడడానికి కూడా అదే కారణం చెప్పారు.  బీఆర్ఎస్ తో గట్టిగా తలపడుతుందని భావించిన బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఆ కారణంగానే పార్టీ వీడుతున్నానని అన్నారు.  ఈ వ్యాఖ్యలతో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని వస్తున్న విమర్శలు, ఆరోపణలకు బలం చేకూర్చారు. 

ఇప్పుడు తాజాగా  మాజీ ఎంపీ  వివేక్  కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. రేవంత్ రెడ్డితో ఆయన దాదాపు గంటన్నర పాటు చర్చలు జరపడమే కాకుండా, అందుకు సంబంధించిన పొటో కూడా విడుదల చేయడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.  మాజీ ఎంపీ వివేక్ సోదరుడు ఇప్పటికే బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.   మొయినాబాద్‌ లోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవంత్, వివేక్ భేటీ  ఫలవంతమైందనీ, ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఇక లాంఛనమేనని రాజకీయవర్గాలు అంటున్నాయి.

 కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానికి ఇంత కాలం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ముక్త తెలంగాణ దిశగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.