ఇప్పటికిప్పుడు వ్యాపారం పెంచుకోవాలంటే లక్షాధికారి అవసరం మావా..అంటాడు ఓ సినిమాలో విలన్ తాలూకు అల్లుడు. వ్యాపారంతో నలుగురిని పోగేసి ఎగస్పార్టీఓడిని తాటిచెట్టుక్కట్టేయొచ్చు.. అని అసి స్టెంటు సలహా! ఈ రెండో మాట ఎలా వున్నా ప్రస్తుత రాజకీయాలకు ప్రతీ చిన్న ఎన్నికకూ ధనికుల అవ సరం బాగా పడుతోంది. ప్రతీ పార్టీ ధనికుల అండదండలతో ప్రశాంతంగా గెలుపు ధీమాతో ఉంటోం ది. ఇపుడు బీజేపీ వారి ఆలోచనా అదే.
అసలు బీజేపీ అంటేనే సంపన్నుల పట్ల ప్రత్యేకాదరణ ఉన్న పార్టీ అనే అభి ప్రాయం ఎలాగూ ఉంది. ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు తెలంగాణలో బీజేపీలో చేరికల తీరు ఉంది. కేవలం సంపన్నులను, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లను ఎంచుకుని మరీ బీజేపీ గాలం వేస్తోంది. ఆర్థికంగా దన్ను ఉన్న వారికి మాత్రమే తమ పార్టీలో ఎంట్రీ అని చెప్పకనే చెబుతోంది. పార్టీని నిలబెట్టడానికి, నడిపించడానికి బీజేపీకి అభిమానులు ఉన్నారు, జెండా భుజాన వేసుకుని జీవితాన్నిపార్టీకోసం పణంగా పెట్టే వీరాభిమానులూ ఉన్నారు.
అయితే పార్టీకి ఆర్థిక దన్నుగా నిలబడి అవసరమైనప్పుడు సొమ్ములు వెదజల్లి మరీ పార్టీకి అండగా నిలబడే వారే బీజేపీకి ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి ఇప్పుడు అవసరం అందుకే బీజేపీ ఏరి కోరి మరీ ఆర్థకంగా బాగా పరిపుష్టత ఉన్నవారికి పార్టీలో చేర్చుకుంటోంది. మొన్నటికి మొన్న కొండా విశ్వేవ్వరరెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరిచింది. పరిశీలకుల అబ్జర్వేషన్ మేరకు ఎన్నికల ఖర్చుకు వెనకాడని వారిని పార్టీలోకి ఆహ్వానించడం వల్ల చిన్నపాటి సమస్యల్ని ఎదుర్కొనడా నికి వారికి శక్తి ఉంటుందని, ప్రతీ అంశంలోనూ అధిష్టానం కల్పించుకుని పనులు జరిగేలా చూడాల్సిన సమస్య ఉండదని పార్టీ సీనియర్ల మాట. ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించడానికి అవసరమైన ఆర్దిక మద్దతు, జనాకర్షణ సమాజంలో ప్రముఖులు, ధనికులతోనే అవుతుందన్నది బీజేపీ నమ్మకం.
ఈ నేపథ్యంలోనే ఇకపై పార్టీలోకి ఎవర్ని ఆహ్వానించాలనుకున్నప్పటికీ ఆర్ధికంగా బలంగా ఉన్న వారినే తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానం పార్టీ తెలంగాణ అధ్యక్షుడికి మౌఖిక ఆదేశాలించ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా సుసంపన్నులన్న సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-targets-financially-sound-persons-only-to-invite-into-party-39-141163.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.