కేసీఆర్ జైలుకి.. ఈటల ఢిల్లీకి! బీజేపీ బాంబ్ పేల్చనుందా! 

Publish Date:Jun 2, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందా? ఎవరూ ఊహించని పరిణామాలు ఉంటాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది కొన్ని వర్గాల నుంచి. కేసీఆర్ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు కూడా తెలంగాణలో ఏదో జరగబోతుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజేందర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరపడం.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో... సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం వస్తోంది. 

బీజేపీ వర్గాలు, ఈటల రాజేందర్ అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గులాబీ బాస్ టార్గెట్ గానే కీలక ఘటనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతి చేసిందని విపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో బండి సంజయ్.. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తర్వాత కొంత వెనక్కి తగ్గారు. తాజాగా మరోసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అయితే ఎప్పుడు జైలుకు పంపించాలనే దానిపై తమ వ్యూహం తమకుందని తెలిపారు. కేసీఆర్ సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు పూర్తిగా తీస్తున్నాం. వారం రోజులుగా సీఎం కేసుల పైనే ఆరా తీస్తున్నాం. ఈ స్కాంలు చూశాకే  కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయింది. త్వరలో ఆయనును జైలుకు పంపించడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున బండి సంజయ్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే సంజయ్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న ఈటల రాజేందర్ .. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ హైకమాండ్ ముందు ఈటల కొన్ని షరతులు పెట్టారని తెలుస్తోంది. అందులో ప్రధానమైనది కేసీఆర్ కుటుంబ అవినీతేనట. తనపై భూకబ్జా ఆరోపణలు చేసి కేబినెట్ నుంచి తప్పించడంపై రగిలిపోతున్న రాజేందర్.. కేసీఆర్ పైనా అదే స్థాయిలో రివేంజ్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే తాను బీజేపీలో చేరాలంటే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారట. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విచారణ కూడా చేపట్టకపోవడాన్ని ప్రజలు అనుమానిస్తున్నారని రాజేందర్ చెప్పారట. దానికి బదులిచ్చిన జేపీ నడ్డా.. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ కుటుంబ కుంభకోణాలపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారని అంటున్నారు.

ఈటల రాజేందర్ తో జరిగిన చర్చల్లో జేపీ నడ్డా ఇచ్చిన హామీ మేరకే.. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో ఉందన్న ప్రచారం సాగుతుండటంతో.. దానికి తెరదించాలని కూడా కాషాయ పెద్దలు సూచించారట. పశ్చిమ బెంగాల్‌ తరహాలో ఉద్యమించాలని బండి సంజయ్ కు జేపీ నడ్డా సూచించారని తెలుస్తోంది. హైకమాండ్ డైరెక్షన్ లో ఇకపై టీఆర్ఎస్ నే తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తారని అంటున్నారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో ఎప్పుడు చేరుతారన్నది తేలడం లేదు. వారం రోజుల్లో బీజేపీలో చేరతారని బండి సంజయ్ చెప్పారు. ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఈటల చేరిక ఆలస్యం కావడానికి మరో కారణం ఉందంటున్నారు. ముందు కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టి.. అతన్ని జనంలో దోషిగా నిలబెట్టాలని రాజేందర్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో విచారణ జరిపించాకే.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారని అంటున్నారు. రాజేందర్ ముఖ్య అనుచరులు మాత్రం మరో వాదన చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపించి.. ఈటల రాజేందర్ కేంద్ర కేబినెట్ లో చేరుతారని చెబుతున్నారు.  

By
en-us Political News

  
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.