బాబంటే భయం భయం.. బీజేపీ, వైసీపీ మైత్రికి అదే కారణం

Publish Date:Jun 25, 2022

Advertisement

బలమైన నేత ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రిగా ఉండకూడదు. అలా అయితేనే కేంద్రం బలహీనతలపై గట్టిగా గళమెత్తే రాష్ట్రం కనిపించదు. ఇదీ మోడీ, షా ఉద్దేశం, లక్ష్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు మరోసారి అధికారం దక్కకూడదు. అందుకు ఏం చేయాలి? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని మరోసారి గద్దెనెక్కించేందుకు ఎలాంటి సహకారం అందించాలి. మోడీ, షా ద్వయం అనుక్షణం ఆలోచిస్తున్న విషయం ఇదే. వారి వ్యూహాలన్నీ ఏపీలో చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని అడ్డుకోవడమెలా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు.. ఇదే వారి ఆందోళన.

ఎందుకంటే ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో పెల్లుబుకుతోందో వారికి బాగా అర్ధమైంది. కొంచం అటూ ఇటూలో జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ పై కూడా ప్రజా వ్యతిరేకత మెండుగానే ఉంది. ఇదీ వారికి అర్ధమైంది. అయితే జాతీయ స్థాయిలో విపక్షాల అనైక్యతను అడ్డుపెట్టుకుని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం నల్లేరు మీద బండి నడకేనని మోడీ, షా ద్వయం భావిస్తున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం కూలిపోయి, చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం మోడీ 3.0కు అడుగడుగునా విమర్శల గండాలు తప్పవని వారు ఊహిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో లేకపోవడం, రాష్ట్రంలో పరిస్థితిపై ఎక్కవ దృష్టి పెట్టాల్సి రావడంతో జాతీయ రాజకీయాలలో ఆయన పెద్దగా వేలు పెట్టడం లేదని వారికి తెలుసు. అదే ఒక సారి రాష్ట్రంలో అధికారంలోనికి వస్తే జాతీయ రాజకీయాలలో ఆయన చురుకుగా పాల్గొంటారనీ, విపక్షాల ఐక్యతకు బాటలు వేయడంలో ఆయన చాంపియన్ అని బీజేపీ పెద్దలకు అనుభవ పూర్వకంగా తెలుసు.

అందుకే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ ఎదుగు దలకు, అధికార సుస్థిరతకు ముప్పుగా పరిణమిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆరు నూరైనా, నూరు ఆరైనా చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టకూడదు.  ఇదీ హస్తినలో కమలం పార్టీ అగ్రనేతల భావన. అందుకే ఏపీలో జగన్ కు ఏ విధంగా సహాయపడాలి, మరోసారి జగన్ ను గద్దెనెక్కిస్తే.. ఏపీలో పరిస్థితి తాము తానా అంటే తానా తందానా అంటే తందానా అన్నట్లుగా ఉంటుందని వారి విశ్వాసం. అందుకే ఏపీలో  జగన్ కు మరో సారి అధికారం కట్టబెట్టడంపై హస్తిన నుంచే కమలం అగ్రనేతలు పావులు కదుపుతున్నారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి విషయంలో అత్యంత అమానవీయంగా కమలం పెద్దలు వ్యవహరించడానికి ఆయనకు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాలే కారణమని కమలం నేతలే బహిరంగంగా చెబుతున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలైతే వెంకయ్య నాయుడి విషయంలో తమ పార్టీ అగ్రనేతలు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరంగా ఉందని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. క్రియాశీల రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనను చెప్పా పెట్టకుండా, హఠాత్తుగా.. స్పష్ఠంగా చెప్పాలంటే ఆయనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన మోడీ, షా ద్వయం, ఆ సమయంలో ఆయనను తదుపరి రాష్ట్రపతిని చేస్తామని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే నాటి హామీని విస్మరించి, ఉద్దేశపూర్వకంగా ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయలేదని అంటున్నారు. ఇందుకు ఏకైక కారణం ఏపీ రాజకీయాలలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత, చంద్రబాబుతో ఆయనకు ఉన్న సత్సంబంధాలే కారణమని కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన కమలం నేతలు వివరిస్తున్నారు.

అయితే వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందనీ, ఆయనకు జరిగిన అన్యాయం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు జరిగిన అన్యాయం వంటిదేననీ అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం వద్ద తమ నిరసనను వ్యక్తం చేసే ధైర్యం మాత్రం చేయలేమని చేతులెత్తేస్తున్నారు.  ఇక పోతే చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడితే.. దక్షిణాదిపై తాము ఆవలు వదిలేసుకోవలసిందేనన్న నిర్ధారణకు వచ్చిన మోడీ, షాలు ఏపీలో చంద్రబాబుకు అన్ని  విధాలుగా అవరోధాలు సృష్టించే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ పై బీజేపీ అగ్రనాయకత్వానికి అపారమైన, అంతులేని ప్రేమాభిమానాలేమీ లేవు.

తమ చెప్పు చేతల్లో ఉండే వ్యక్తిగానే జగన్ పట్ల వారు అపేక్ష చూపుతున్నారు. అడగక ముందే మోడీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి బేషరతుగా మద్దతు ప్రకటించేసిన జగన్ పట్ల వారికి ఇష్టం లేకపోయినా.. కోపం ఎందుకు ఉంటుంది? జగన్ కోరిందే తడవుగా సీబీఐ కోర్టు విదేశీ యానానికి అనుమతి ఇచ్చేయడం, కేసు విచారణను సుదీర్ఘంగా కొనసాగేలా ఆయనకు అనుకూలంగా వాయిదాల మీద వాయిదాలు వేయడం.. మోడీయే చెప్పినట్లు రాజకీయ నాయకులపై కేసుల విచారణను సత్వరమే అంటే వీలైతే ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయాలన్న భావననే వ్యక్తం చేయకపోవడం వంటి వన్నీ.. ఏపీలో తమ పల్లకి మోసే నేతగా వారు జగన్ ను గుర్తించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ పై ఏపీలో ఎంత ప్రజా వ్యతిరేకత గూడు కట్టుకుని ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకువస్తే అది  జగన్ పార్టీకి మేలు చేకూరుస్తుందన్న అంచనాతో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది.

అందుకే పవన్ కల్యాణ్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు ఆయనను జగన్ పార్టీ ఎలా రెచ్చగొడుతోందో, అంతకు మించి బీజేపీ రెచ్చ గొడుతోండటం ఇందులో భాగంగానే చూడాలి. తెలుగుదేశం, జనసేన, వైసీపీలు వేర్వేరుగా పోటీలో ఉండి, ఏపీలో త్రిముఖ పోరు అనివార్యమైన పరిస్థితి తలెత్తితే అది జగన్ కే ప్రయోజనం చేకూరుస్తుందన్నది బీజేపీ అంచనా. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకూ మారేలా బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది.  రానున్న రోజులలో తెలుగుదేశం కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ప్రతాపాన్ని చూపించే విధంగా వ్యూహాలు రచిస్తోందని కమలం వర్గాల ద్వారానే తెలుస్తోంది.

తాడిపత్రిలో జేసీ సోదరుల నివాసాలపై ఈడీ దాడులను ఇందుకు ఆరంభంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   చంద్రబాబును ఈ సారి అధికారానికి దూరం చేయగలిగితే తెలుగుదేశం పని ఇక అయిపోయినట్లేనని బీజేపీ, వైసీపీ భావిస్తున్నాయి. అలా కాకుండా ఈ సారి చంద్రబాబు గెలిస్తే వైసీపీ పనైపోయినట్లేననీ, అలాగే బీజేపీకి ఇక ఏపీలో ఉనికి శూన్యమేననీ కూడా ఆ పార్టీలు భావిస్తున్నాయి.   ఏపీలో జనసేన టీడీపీ కలిసే అవకాశం లేకుండా బీజేపీ ఎత్తులు వేస్తోందని అంటున్నారు.  మొత్తానికి ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నా.. విపక్షాలు ఏకమైనా కూడా.. బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఏపీలో మరోసారి వైసీపీని అధికార పీఠం ఎక్కించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.