కలిసొస్తే పవన్ తో.. లేకుంటే ఒంటరిగా!

Publish Date:Jun 2, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అడుగులు ఎటుగా పడుతున్నాయో, ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. కలిసొస్తే పవన్ కళ్యాణ్ తో కాదంటే ఒంటరిగా... ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవంక పవన్ కల్యాణ్ వందకు రెండొందల శాతం తెలుగు దేశం పార్టీతో పొత్తుకు సిద్దమయ్యారు. సో  అటు బీజేపీ, ఇటు జనసేన అలాగే, టీడీపీ ఆలోచనలు ఇదే విధంగా కొనసాగితే, ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవంక బీజేపీ అడ్డు తొలిగి పోవడంతో తెలుగు దేశం, జనసేన కూటమి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని  వామపక్షాలు ఇతర పార్టీలు టీడీపీ కూటమితో చేతులు కలిపితే ఇక టీడీపీ, జేనసేన కూటమి గెలుపునకు తిరుగుండదని పరిశీలకులు భావిస్తున్నారు.   

అదలా ఉంటే బీజేపీ ఒంటరిగా మిగిలినా  వైసీపీతో సీక్రెట్ సంసారం సాగించినా  రాష్ట్రంలో బీజేపీకి ఉన్నదీ లేదు, పోయేదీ లేదనీ, ఆపార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలను ప్రభావితం చేసే పరిస్థితిలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా ఒక శాతం లోపు ఓట్లు తెచ్చుకున్న కమలం పార్టీ  ఈసారి ఒంటరిగా వెళితే ఆ మాత్రం ఓట్లు కూడా రావని పరిశీలకులే కాదు బీజేపీ నాయకులు సైతం అంటున్నారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రత్యేక హోదాను బీజేపీ నాయకత్వం ముగిసిన అధ్యాయం అని తేల్చేసినప్పుడే, రాష్ట్రంలో బీజేపీ చరిత్ర ముగిసిపోయిందననీ బీజేపీ అభిమానులు, కార్యకర్తలు సహా  అందరూ అంగీకరిస్తున్నారు. 

అదలా ఉంటే,ఇప్పటికే ఒకసారి  హస్తం పార్టీ మాజీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి అభాసు పాలైన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అదే విఫల ప్రయోగానికి తెర  తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచన కమలదళం చేస్తోందని అంటున్నారు. అయితే ఎనిమిది సంవత్సరాలకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పై బీజేపీ ఆశలు పెంచుకోవడం ఆత్మహత్యా సదృశ్యమనే విచారం సంఘ్ పరివార్ వర్గాల్లో వినవస్తోంది. 

మరోవంక  కాలం చెల్లిన రాజకీయ నాయకుడిగా తనకు తానుగా ముద్రవేసుకుని ఒక విధంగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి అన్ని రకాల రుగ్మతలతో చతికిల పడిన పార్టీని పరుగులు తీయించగలరా? అది అయ్యే పనేనా? అంటే  ఇటు పార్టీ వర్గాలు,అటు రాజకీయ పరిశీలకుల నుంచి కాదనే సమాధానమే వస్తోంది. అయితే, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి కొందరు విశ్లేషకులు మాత్రం మోడీషా జోడీ నాయకత్వంలోని  బీజేపీకి తివిరి ఇసుమున తైలంబు తీసే సామర్ధ్యం ఉందని అంటున్నారు.  నిజానికి, పార్టీ పరిస్థితి ఏపీ కంటే అద్వాన్నంగా అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చిన విషయాన్ని, అదే విధంగా 33 ఏళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ పాలించిన పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రాకున్నా,లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిని జీరో కు నెట్టేసి, 70కి పైగా అసెంబ్లీ  స్థానాలతో బీజేపీ అధికార తృణమూల్  కు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. 

అయితే  ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల విద్యలు దక్షిణాదిన పనిచేయవని  కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని విజయం నిరూపించిన నేపధ్యంలో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు,కేరళ రాష్ట్రాలలో కమలం పార్టీ కాషాయ రాజకీయాలు సాగవనే వాదన కూడా లేక పోలేదు.  అదెలా ఉనా  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం విషయంలో బీజేపీ వర్గాల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కిరణ్ కుమార్  రెడ్డి అవుట్ డేటెడ్ పొలిటీషియన్, కాలం చెల్లిన రాజకీయ నాయకుడు. అదెలా ఉన్నా వంటి నిండా నరనరాన కాంగ్రెస్ రక్తం నింపుకున్న నాయకుడు. అనేక సందర్భాలలో అసెంబ్లీ లోపలా బయటా కూడా బీజేపీను తూలనాడిన నాయకుడు.  

అలాంటి కిరణ్ కుమార్  రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని అనుకోవడం లేద ని పార్టీ పాత తరం నేత ఒకరు  చిన్నగా నవ్వేశారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో అదృష్టం కలిసొచ్చి ముఖ్యమంత్రి అయ్యారేకానీ, ఆయనకు రాష్ట్రంలో కాదు, కనీసం ఆయన సొంత జిల్లా చిత్తూరులో కూడా  పెద్దగా పట్టున్న నాయకుడు కాదు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి  సరైన సమయంలో సరైన  నిర్ణయం తీసుకోక, ఆఖరి బంతి అదీ ఇదని చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కుని కూర్చున్నారు. అందుకే రాష్ట్ర విభజన క్రతువు మొత్తం శాస్త్రోత్రంగా అయ్యే వరకు ఆగి అప్పుడు రాజీనామా చేసిన ఆయన పెట్టిన సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి, సొంతంగా సమైక్యాంధ్ర (చెప్పుల) పార్టీ పెట్టి 2014లో పోటీ చేసిన ఆయనకు 175 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కలేదు.

ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినా  ఇంచు మించుగా దశాబ్ద కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  సో .. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినా రాష్ట్రంలో కమల దళం వికసించే అవకాశం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా, ఆయనకు  ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ... అది తెలంగాణలో బీఆర్ఎస్  కు మరో అస్త్రం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.