ఏపీలో పారని బీజేపీ పాచికలు కేంద్రంతో జగన్ బంధమే కారణమా?

Publish Date:Sep 15, 2022

Advertisement

దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఎలా సాగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఏపీలో బీజేపీకి ఆదరణ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా దిగజారిపోతున్నది. ఇందుకు కారణం అధికార వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు, పొత్తులు ఉన్నాయన్న భావన ప్రజలలో గట్టిగా ఏర్పడటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశాయి. అయితే పునర్విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో బీజేపీ ప్రయత్నించిందన్న భావన ఉండటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తును ఏపీ ప్రజ హర్షించింది. ఆదరించింది. దాంతో ఏపీలో బీజేపీకి ఓ నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అయితే ఆ తరువాత ఐదేళ్లూ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన ప్రయోజనాలకు  మోడీ సర్కార్ గండి కొట్టిందన్నభావన ప్రజలలో గట్టిగా కలిగింది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఒకటి అనేమిటి, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేరని పరిస్థితిపై ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో 2019 ఎన్నికలలో బీజేపీకి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. ఇక వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఆయన కేంద్రాన్ని కోరింది లేదు.. కేంద్రం పట్టించుకున్నది లేదు.ఏపీలో జగన్ సర్కార్ కు ప్రజాదరణ వేగంగా తగ్గిపోవడాన్ని గమనించిన బీజేపీ.. రాష్ట్రంలో తన పట్టు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడం ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారమంతా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్లు చేస్తాను అన్న చందంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ బీజేపీ జగన్ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో పలుకుబడి పంచుకోవాలని చూస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆంద్రప్రదేశ్ బీజేపీ ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించింది.  ప్రజాపోరు పేరుతో ఐదు వేల సభలు ఏర్పాటు చేసిప్రజలలో ఆదరణ పెంచుకోవాలని నిర్ణయించింది.   కానీ బీజేపీ యాత్రలు   పర్యటనలు.. ప్రసంగాలు, విమర్శలను ఏపీ జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  జగన్ సర్కార్ కు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంటే.. ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తున్నాం, పోరాడుతున్నాం అంటే చేస్తున్న విన్యాసాలను ప్రజలు విశ్వసించకపోవడమే ఏపీలో బీజేపీని జనం పట్టించుకోకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలను కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఎలా ఇబ్బందుల పాలు చేస్తున్నదో కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్క ఏపీకి మాత్రమే కేంద్రం అన్ని రకాలుగా సహకరించడమే..ఇందుకు కారణం. అసలు ఏపీలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కాదా అన్న అనుమానం కలిగేలా కేంద్రం నుంచి సహకారం అందుతోందన్న విమర్శలు విపక్షం నుంచే కాదు..సామాన్య జనం నుంచి కూడా వినవస్తున్నాయి. జగన్ హయాంలో అభివృద్ధి అడుగంటిపోయినా, అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రబలుతున్నా..ఆర్థిక అరాచకత్వం పరాకాష్టకు చేరినా కేంద్రం నుంచి మాత్రం ఆయనకు సంపూర్ణ సహకారం అందడం పట్ల జనబాహుల్యంలో ఆగ్రహం వ్యక్తమౌతోందని అంటున్నారు.

అందుకే ఏపీలో బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ అమరావతి యాత్రలో జనం ఆ పార్టీ నేతలను నిలదీయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇక్కడి వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నదన్న భావన కారణంగానే ఇక్కడి జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతే బీజేపీపై కూడా వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటగున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. జగన్ సర్కార్ నిబంధనల ఉల్లంఘధనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించడం ఒక్కటే మార్గమని పరిశీలకులే కాదు, బీజేపీ ఏపీ నేతలు కూడా అంటున్నారు.

 నిబంధనలను తుంగలో తొక్కి చేసిన అప్పుల లెక్కలను బయటపెట్టాలని ఏపీ సర్కార్ ను ఆదేశించకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చోద్యం చూడడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ విమర్శలతో విరుచుకుపడడాన్ని రాజకీయ డ్రామాగా జనం భావిస్తున్నారు.  అందుకే ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజలు స్పందించడం లేదు. పట్టించుకోవడం లేదు. ఆ కారణంగానే దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న బీజేపీ పాచికలు ఏపీలో పారడం లేదు.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.