AP, TGలకు: బీజేపీ కొత్త ఇంచార్జ్‌లు..ఎవరంటే.?

Publish Date:Sep 23, 2026

Advertisement

వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!

రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని కీలక నేతలకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో కొత్త ఇన్‌చార్జ్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా పార్టీ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నాయకురాలు స్మృతి ఇరానీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. 

ఆమెకు హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను కేటాయించారు. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న స్మృతి ఇరానీకి రెండు ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఆమె ప్రాధాన్యత మరింత పెరిగినట్లయింది. మరోవైపు, పార్టీలో కీలక వ్యూహకర్తగా పేరుగాంచిన సునీల్ బన్సల్‌కు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఇన్‌ఛార్జి బాధ్యతలు కేటాయించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్: అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ-ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు.ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహ-ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. తమిళనాడు: రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదే క్రమంలో మరికొద్ది మంది సీనియర్ నాయకులకు కూడా ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు దక్కాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న రామ్ మాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాధ్యతలను కేటాయించారు. అలాగే, వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, వినయ్ సహస్రబుద్ధేను ఢిల్లీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీలు, సహ-ఇన్‌ఛార్జీల పూర్తి జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు, రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ తాజా మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

 

 

[ BJP state in charges, Smriti Irani, Sunil Bansal, Telangana BJP, Ram Madhav, BJP news updates, Arvind Bhadauria, Daggubati Purandeswari, DK Aruna,Ram Madhav, Nitin Nabeen ]


 

By
en-us Political News

  
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.