తెరాస పై బీజేపీ సెంటిమెంట్ వార్ ఢిల్లీలో డే’ వేడుకలు

Publish Date:Jun 1, 2022

Advertisement

భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించిందా? ఏది ఏమైనా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? అందులో భాగంగానే తెలంగాణ సెంటిమెంట్ ‘ను కూడా సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు, పార్టీ నాయకులు, రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక అష్ట దిగ్భందనంలో బిగించి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా సిద్ధం చేస్తోందా,  అంటే, అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. 

నిజం. ఈ రాజకీయ పార్టీ అయినా, అధికారమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఈవిషయంలో బీజేపీ ఎక్కువ చదివిందా, తెరాస ఎక్కువ చదివిందా అంటే, నిస్సందేహంగా బీజేపీని ఒకాకు ఎక్కువ చదివింది. అందుకే, 2023 ఎన్నికలు లక్ష్యగా పావులు కడుపుతున్న కమల దళం  రాష్ట్రంపై పట్టు పెంచుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ముఖ్యంగా సెంటిమెంట్’ను అడ్డు పెట్టుకుని ఒకటికి రెండుసార్లు,అధికారంలోకి వచ్చిన తెరాస గద్దె దించేందుకు ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని పాటిస్తోంది. సెంటిమెంట్’ అస్త్రంతో రెండుసార్లు విజయం సాధించిన తెరాస ను అదే సెంటిమెంట్ అస్త్రంతో ఓడించాలని, బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.  

గత సంవత్సరం సెప్టెంబర్ 17న, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో కేంద్ర  హోం మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్నారు.అప్పుడే, తెలంగాణలో 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ వాగ్దానం చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. ఇప్పుడు తెరాస  ప్రభుత్వం విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు.

అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీకి బీజేపీ భయపడదని.. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్‌ షా చెప్పారు.

అదలా ఉంటే ఇప్పుడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో  అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభత్వం నిర్ణయించింది. ఇది కూడా తెలంగాణసెంటిమెంట్’ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో భాగంగానే చూడాలని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్’లో చేసిన వ్యాఖ్యలపై తెరాస రాజకీయ దుమారం సృష్టించిన నేపధ్యంలో  బీజేపీ, కౌంటర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తోందని అంటున్నారు. 
 అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జూన్ 2న ఢిల్లీలో అధికారికంగా నిర్వహించాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా పాల్గొన‌నున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వం దేశం ఘనమైన చరిత్ర, సంస్కృతి, సాధించిన విజయాలను వేడుకల రూపంలో ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఇందులో భాగంగా 2 జూన్, 2022న సాయంత్రం న్యూఢిల్లీలోని డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించ‌నున్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి  అమిత్ షా చైర్మన్‌గా ఉన్న నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదంతో నిర్వ‌హిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత గాయనీ, గాయకులు మంగ్లీ, హేమచంద్ర తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఉధృతమైన వేళ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో  రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తుండటం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  కేంద్రం పై యుద్ధం ప్రకటించి, జాతీయ స్థాయిలో  బీజేపీకి వ్యతిరేకంగా ప్రాతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న సమయంలో, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యమత్రి ముందరి కాళ్ళకు బంధాలు వేసే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంకృతంతో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని  అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.