పేరుకు బీసీ జపం.. పదవుల వేటే అసలు మంత్రం!

Publish Date:Dec 3, 2024

Advertisement

భక్తి దేవుడిపై కాదు.. ప్రసాదం మీద అన్నట్లుగా ఆర్. కృష్ణయ్య తీరు ఉంటుంది. బీసీలకు తానే నాయకుడినని చెప్పుకుంటూ  ఆ పేరుతో అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరి బడా పదవులు కట్టేస్తుంటారు. స్వల్ప వ్యవధిలోనే దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేశారు.  ఏ పార్టీలోకి వెళ్లినా బ‌డా ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌టం ఆయ‌నకు వెన్న‌తో పెట్టిన విద్య. పార్టీల అధిష్టానాలు సైతం ఆయ‌నకు ప‌ద‌వి ఇస్తే బీసీల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లేన‌ని భావిస్తాయి. కానీ, ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మెజార్టీ బీసీలు దూర‌మైన‌ట్లే. ఈ విష‌యం అనేక‌ సార్లు రుజువైంది. కానీ, ఆయ‌న మాత్రం బీసీలంతా తన వెంటే.. తన వైపే అంటూ ఇప్ప‌టికీ రాజకీయ పార్టీలను నమ్మించి పెద్ద పెద్ద పదవులను తన ఖాతాలో వేయించేసుకుంటారు.  తాజాగా మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ఆయ‌న‌ సిద్ధ‌మ‌వుతున్నారు.. ఈ సారి మ‌రో కొత్త‌ పార్టీ నుంచి. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌ర‌ని తెగ ఆలోచిస్తున్నారా.. అంత అవ‌స‌రం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న పేరు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే. ఆయ‌నే రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణ‌య్య. మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన కృష్ణ‌య్య‌.  ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్ర‌స్తుతం బీజేపీ కండువా క‌ప్పుకొని ఆ పార్టీ నుంచి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. అయితే బీసీ నాయ‌కుడి హోదాలో ఆర్‌. కృష్ణ‌య్య బ‌డా ప‌దవులు ద‌క్కించుకుంటున్న‌ప్ప‌టికీ.. బీసీ వ‌ర్గాల‌కు, ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చి గౌర‌వించిన పార్టీల‌కు ఇసుమంతైనా మేలు చేకూర్చ‌లేక పోతున్నారు సరికదా, పదవులిచ్చిన పార్టీలకు ఆయన వల్ల తేరుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఆర్.కృష్ణయ్యకు పెద్ద పీట వేసిన వెంటనే ఆయా పార్టీలకు బీసీలు దూరం అవుతున్నారు. పాలిటిక్స్ లో ఇదో సెంటిమెంటుగా ధృవపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్.కృష్ణయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి  మెజార్టీ బీసీలు హ్యాడిచ్చేస్తారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం (డిసెంబర్ 3(నోటిఫికేషన్‌ విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు తెలుగుదేశంలో చేరారు.  ఆర్‌.కృష్ణయ్య మాత్రం తాను ఏ పార్టీలోనూ చేరను, సొంత పార్టీ పెడతా అంటూ బీరాలు పలికినా.. బీజేపీ పెద్దలతో మాత్రం టచ్‌లో ఉన్నారు.  ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే రాజీనామా చేశారు. అదీ ఎన్నికలలో తాను ఏ పార్టీ తరఫునైతే ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజీనామా చేశారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన బీసీ నేత‌గా పేరున్న ఆర్‌. కృష్ణ‌య్య బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి మ‌రోసారి ఆయ‌న‌ రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యింది కాబట్టి. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లే వారిలో ఇద్ద‌రు తెలుగుదేశం నుంచి నుంచి కాగా.. మ‌రొక‌రు కూటమి కోటాలో బీజేపీ నుంచి వెళ్ల‌నున్నారు. బీజేపీ నుంచి వెళ్లే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆర్‌. కృష్ణ‌య్య పేరు   ఖాయ‌మైందని తెలుస్తోంది. ఆర్ కృష్ణ‌య్య‌కు పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం ద్వారా తెలంగాణ‌లోని బీసీలంతా బీజేపీవైపు వ‌స్తార‌ని కమలనాథుల అంచ‌నా వేస్తున్నారు. అయితే, గ‌తంలో ఆర్ కృష్ణ‌య్య‌కు పెద్ద‌పీట వేసిన పార్టీలు కూడా ఇలానే ఆలోచించి చేతులు కాల్చుకున్నాయి.  ప్ర‌స్తుతం బీజేపీ ఆ జాబితాలో చేరేందుకు సిద్ధ‌మైంది.

2014 లో రాష్ట్ర విభ‌జ‌నకు ముందు వ‌ర‌కూ ఆర్‌.కృష్ణ‌య్య బీసీ సంఘం నేత‌గా కొన‌సాగారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత అనూహ్యంగా తెలంగాణ తెలుగుదేశంలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఎల్బీన‌గ‌ర్ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు.  2018లో తెలంగాణ‌లో జరిగిన ముందస్తు ఎన్నికల స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణయ్య  కాంగ్రెస్ గూటికి చేరారు.  ఆ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ త‌రువాత కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ తో స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌ర్చుకున్నారు. వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వైసీపీ అధికారానికి దూరం కాగానే ఆ పార్టీకి, ప‌ద‌వికి ఆర్‌. కృష్ణ‌య్య రాజీనామా చేశారు.  ప్ర‌స్తుతం బీజేపీలో చేరి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక్క‌డ విశేషం ఏమిటంటే.. ఆర్. కృష్ణ‌య్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాద‌న్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తుంటుంది. దీనికి కార‌ణం లేక‌పోయ‌లేదు. ఆయా పార్టీలు ఆర్‌. కృష్ణ‌య్య మ‌న‌ పార్టీలో ఉంటే బీసీలంతా మ‌న‌వైపు ఉంటార‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటారు. కానీ, ఫ‌లితం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటూ వస్తోంది.  ఊసరవిల్లి రంగులు మార్చడం కంటే వేగంగా  కృష్ణయ్య పార్టీలు మార్చేస్తుండటం కూడా సహజంగానే బీసీలలో ఆయన పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నది. అందుకే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకీ బీసీలు దూరం అవుతున్నారన్న వాదన కూడా ఉంది. 

ఆ వాదన ప్రకారం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పాగావేయాల‌ని భావిస్తున్న‌ బీజేపీకి.. ఆర్ కృష్ణ‌య్య చేరిక ఎదురుదెబ్బే అవుతుంద‌న్న భావన రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆర్. కృష్ణ‌య్య బీజేపీలో చేర‌డాన్ని ఆ పార్టీలోని ప‌లువురు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఒక‌వేళ‌ పార్టీ కండువా క‌ప్పినా కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించొద్ద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇచ్చి గౌర‌వించేందుకు సిద్ధ‌మైపోయింది. అయితే, ఆర్‌. కృష్ణ‌య్య ఈసారైనా రాజ్య‌స‌భ హోదాలో బీసీ వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంతోపాటు.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చేలా ఏమేర‌కు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.