ది కేరళ స్టోరీ ప్రమోటర్ బీజేపీ!?

Publish Date:May 9, 2023

Advertisement

మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


మత మార్పిళ్ళ వ్యవహారంపై నిర్మించిన 'ది కేరళ స్టోరి' సినిమా విడుదల పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.   అయితే ఈ సినీమాకు బీజేపీ నేతలు ప్రమోటర్స్ గా  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఈ సినిమా ఉగ్ర వాదాన్ని బట్ట బయలు చేసిందని సాక్షాత్తు కేంద్ర సమాచార, ప్రసా ర క్రీడలు, యువత వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు.  ఈ చిత్రం ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని మంత్రి అంటున్నారు. ఉగ్రవాదం, మత మార్చిడి చేతులు కలిపి ఒకదానికి ఒకటి ఊతమిచ్చుకుంటున్న ఒక అనైతిక బంధాన్ని చిత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపిందని చెబుతున్నారు. చిత్ర ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఖండిస్తూ.. ఈ నిషేధంతో   మమతా బెనర్జీ రాష్ట్రంలో మహిళా లోకానికి అన్యాయం చేస్తు న్నారని  విమర్శించారు.

ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేసేవారితో అంటకాగుతున్నారా లేక వారికి వ్యతిరేకంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధా నం మమతా బెనర్జీ చెప్పాలని  నిలదీశారు. ఉగ్రవాదం ప్రధా నాంశంగా వచ్చిన ఒక చిత్రాన్ని ఎందుకంత పెద్ద సమస్యగా భావిస్తున్నారంటూ యావత్ దేశం ఆమెను ముక్త కంఠంతో ప్రశ్నిస్తోందన్నారు.

ది కేరళ స్టోరీ సిన్మాకు బీజేపీ ప్రమోషన్ బాధ్యతలు తీసుకోవడం వల్ల ఆ విత్ర నిర్మతలకు ప్రమోషన్ ఖర్చు గణనీయంగా తగ్గిందని ఈ సినీమాను వ్యతిరేకించే వారు అంటున్నారు. గతంలో కూడా  బీజేపీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఇలాంటి సహకారాన్నే అందించిందని గుర్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.