జగన్ వ్యతిరేకులందరూ ఏకమయ్యారు.. ఇంటలిజెన్స్ ఏమి చేస్తున్నట్టు... 

Publish Date:Mar 15, 2020

Advertisement

* ఎన్నికల కమిషన్ నిర్ణయం జగన్ కు తలనొప్పి వ్యవహారమే 
* లీగల్ పాయింట్స్ తో ఏకగ్రీవాలను సైతం ఛాలెంజ్ చేయటానికి రెడీ రెడీ అయిన తెలుగుదేశం 
* ఇప్పటికే వై ఎస్ ఆర్ సి పి పై కత్తులు నూరుతున్న కన్నా 
* జన సేన తడాఖా ఏమిటో ఇప్పుడు చూడండంటున్న పవన్ కళ్యాణ్ 

ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడుట వెనుకటికో పెద్దమనిషి. అలా తయారైంది రాష్ట్రం లో అధికార వై ఎస్ ఆర్ సి పి పరిస్థితి. రికార్డు వ్యవధిలో స్థానిక ఎన్నికలు నిర్వహించి పేరు తెచ్చుకుందామని తహ తహ లాడిన జగన్ మోహన్ రెడ్డి పార్టీని, తెలుగుదేశం , జనసేన, బీ జె పీ రాష్ట్ర  నాయకత్వాలు  ఎవరి స్థాయిలో వారు గవర్నర్కు, కేంద్రానికి ఫిర్యాదులు చేయటం ద్వారా వై ఎస్ ఆర్ సి పి దూకుడు ని అడ్డుకున్నారు. నిజానికి కన్నా లక్ష్మీ నారాయణ చేసిన హోమ్ వర్క్ మామూలుది  కాదు.  ఈ విషయం లో...తన భూములకె దిక్కు లేని ఈ రాష్ట్రం లో జగన్ పాలన ను అలా చూస్తూ ఊరుకుంటే, రాష్ట్రమంతా కబ్జా మయమైపోతుందంటూ ఆయన చేసిన ఫిర్యాదుకు, బీ జె పి కేంద్ర నాయకత్వం చాలా తీవ్రంగా స్పందించింది. స్థానిక  సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించినట్టే.  

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా , వై ఎస్ ఆర్ సి పి అధినేత నిజానికి దూకుడు గా వెళ్లడం వల్ల , కొని తెచ్చిపెట్టుకున్న సమస్య. అయితే, పదే పదే ఇలాంటి తప్పుల్లో జగన్ మోహన్ రెడ్డి ఎలా కాలు  వే స్తున్నారనే  అంశం లో -జగన్ క్యాంప్ లో ఇప్పటికీ క్లారిటీ రాకపోవటమే అసలైన విషాదం. అటు తన దూకుడు వైఖరి తో పాటు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లో డొల్ల తనం కూడా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండానే, సగం లో ఆగిపోయే పరిస్థితి వస్తోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, ఏ బీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయం లో ప్రతిపక్షం ఎత్తుగడలు పసికట్టడం- చంద్రబాబు నాయుడుకు చాలా  సులభతరమైన టాస్క్ అయ్యేది. వాస్తవానికి స్టీఫెన్ రవీంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గావచ్చి ఉండి ఉంటె, జగన్ మోహన్ రెడ్డి కి ఇలాంటి విషయాల్లో కొంత బ్రీతింగ్ స్పేస్ దొరికేది. కనీసం కౌంటర్ స్ట్రాటజీస్ తో ఎలా వెళ్లాలనే అంశం లో స్టీఫెన్ లాంటి అనుభవజ్ఞుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి అంశం లోనూ , ప్రత్యేకించి రాజకీయంగా ముందస్తుగా పరిణామాలు ఊహించే , పసికట్టే అంశాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాఢ నిద్ర పోతుండటం వల్లనే ఇలాంటి షాకింగ్ డెవెలెప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని వై ఎస్ ఆర్ సి పి నాయకులు వాపోతున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించాయా?- ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తోన్న ప్రశ్నలు ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మరో వైపు నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల సమీపంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని వారు ప్రధానంగా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. వీడియో క్లిప్పింగులను చూపించారు. జగన్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, విషయం లో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన దూకుడు వైఖరిని  కూడా, కేంద్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకున్నట్టు సమాచారం.

By
en-us Political News

  
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో విజయం అనేది కేవలం నాయకుల ఉపన్యాసాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. అధికారం, రాజకీయ వేధింపులు, ఆంక్షలు ఎన్ని ఎదురైనా వెరవక
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పరిధిలో దాదాపు రూ. 7.5 కోట్ల విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై పార్లమెంట్‌ ద్వారం వద్ద స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, పూజారి వేషంలో ఒక పెద్ద హుండీతో కూర్చుని సేకరించిన విరాళాలను జేబులో వేసుకుంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.