తెలంగాణలో బీజేపీ.. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు!?

Publish Date:Oct 1, 2024

Advertisement

భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయిలో గత పదేళ్లుగా చక్రం తిప్పుతున్న ఈ పార్టీ దక్షిణాదిలో మాత్రం పట్టు సాధించడంలో విఫలమౌతోంది. కర్నాటకలో ఏదో మేరకు బలం ఉన్నా.. అక్కడ ఆ పార్టీ స్థిరంగా వేళ్లూనుకుందని చెప్పడం కష్టం. ఇక దక్షిణాది ఆ పార్టీకి ఏదో మేరకు ఆశలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో బీజేపీకి పట్టణ ప్రాంతాలలో పట్టు ఉన్నప్పటికీ గ్రామీణంలో మాత్రం అంతంత మాత్రమే. అయితే తెలంగాణలో అధికార పీఠం అందుకోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరాలంటే మాత్రం ఆ బలం సరిపోదు. ఈ విషయం బీజేపీ అగ్రనాయత్వానికీ స్పష్టంగా తెలుసు. దాంతో ప్రజలలో అంతో ఇంతో పలుకుబడి ఉంది అంటే చాలా వారి రాజకీయ నేపథ్యం, వారి సైద్ధాంతాలు వంటి వాటిని ఇసుమంతైనా పట్టించుకోకుండా దొరికిన వారిని దొరికి నట్లు పార్టీలోకి ఆహ్వానించేసి  కండువాలు కప్పేసింది. రాష్ట్రంలో ఇక అధికారమే తరువాయి అన్నట్లుగా భావించింది. అయితే 2023 ఎన్నికలు ఆ పార్టీ విశ్వాసంపై చావు దెబ్బ కొట్టాయి. పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరడానికి ఇష్టారీతిగా పార్టీలో చేరికలను ప్రోత్సహించడమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకున్నట్లు కనిపించింది. ఏకంగా 9 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. దీంతో 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. అయితే  ఆ అడుగులు తడబడుతున్నాయి. 

రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీలో నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. క్యాడర్ కు దిశా నిర్దేశం చేసి ముందుండి నడిపించే నేత కరవయ్యారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ తరువాత స్థానం బీజేపీదే.. ప్రత్నామ్నాయం బీజేపీనే అన్నట్లుగా పరిస్థితి మారింది. పదేళ్ల పాటు రాష్ట్రంలో అధకారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయింది అనిపించేలా పరిస్థితులు మారాయి. అయితే బీజేపీ అంతర్గత కలహాలు, విభేదాలతో ఆ పరిస్థితిని చేజేతులా జారవిడుచుకున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వ మార్పు కోసం ఆ పార్టీలో చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్నా, కిషన్ రెడ్డి స్థానంలో రాష్ట్ర పార్టీకి మరో అధ్యక్షుడిని నియమించే విషయంలో బీజేపీ హైకమాండ్ మీనమేషాలు లెక్కించింది.  గతంలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యకుడిగా ఉన్న సమయంలో అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీ మీద దూకుడుగా ముందుకెళ్ళేది బీజేపీ. అలాగే అటు కాంగ్రెస్ పార్టీని కూడా తన విమర్శలతో ఇరుకున పెట్టి అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది బీజేపీ. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచీ బీజేపీలో దూకుడు మాయమైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలో కొద్దిగా ఐక్యతా రాగం వినిపించినా, ఇప్పుడు ఆ ఐక్యత కనిపించడం లేదు.

అలాగే అటు హైడ్రాతో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలతో ప్రజల వ్యతిరే కతను మూటకట్టుకుంటుంటే బీజేపీ చేష్టలుడిగి నిలబడిపోయింది. అదే సమయంలో ఇక అయిపోయిందనుకున్న బీఆర్ఎస్ పుంజుకుని ప్రజా మద్దతును కూడగట్టుకుని హైడ్రాకు వ్యతిరేకంగా జనంలోకి బలంగా వెడుతోంది. కానీ బీజేపీ మాత్రం స్తబ్దుగా మిగిలిపోయింది.   అంది వచ్చిన అవకాశాలను జారవిడుచుకుని తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలహీనమౌతోందని పార్టీ శ్రేణులే  అంటున్నాయి. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.