బండి భేష్.. తెలంగాణలో కమలం వికసిస్తే ఆయనే సీఎం!

Publish Date:Jun 10, 2022

Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధిష్టానం మొప్పు పొందారు. రాష్ట్రంలో బీజేపీని గెలిపించడానికి ఆయన ఒక్కరే చాలన్నంతగా బండి అధిష్టానం విశ్వాసాన్ని చూరగొన్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఆయనే అని ఇప్పటికే బీజేపీ హై కమాండ్ సంకేతాలిచ్చేసింది. అందులో భాగంగానే ఆయనకు లైన్ క్లియర్ చేయడానికి చర్యలకూ ఉపక్రమించేసింది. మా కంటే బండి చాలా జూనియర్ అంటూ తమ సీనియారిటీని ప్రదర్శిస్తారన్న అనుమానం ఉన్న నాయకులందరినీ ఏదో నెపంతో సైడ్ ట్రాక్ చేస్తోంది.

 అందులో భాగంగానే తెలంగాణలోని బిజెపి సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని రాష్ట్రంతో సంబంధం లేకండా జాతీయ స్థాయి బాధ్యతలు కట్టబెడుతోంది.  బండారు దత్తాత్రేయను గవర్నర్ గా పంపించిన జాతీయ నాయకత్వం కిషనర్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. తాజాగా  ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు  కె. లక్ష్మణ్ ను  రాజ్యసభకు పంపించింది. తెలంగాణలో ప్రధానంగా ఉన్న సీనియర్ నాయకులను ఒక్కొక్కరిని కేంద్రానికి తీసుకెళ్ళడంతో పాటు వారికి సముచిత పదవీ బాధ్యతలను అప్పగిస్తూ వస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్టు రాష్ట్ర బిజెపి వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోం మంత్రి, ప్రధాని తర్వాత అంతటిస్థాయి నాయకుడు అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ ఒక్కడు చాలు... అంటూ కితాబు ఇచ్చారు.   తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తే బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అమిత్ షా ఆ ఒక్క మాటతో రాష్ట్ర కేడర్ కు విస్పష్టంగా అర్దమయ్యేలా చెప్పేశారని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.  బండి సంజయ్ నియోజకవర్గం కరీంనగర్ లో బిజెపిలో అసంతృప్తి నాయకులు సమావేశమైతే.. వారిని డిల్లీకి పిలిపించి మరీ జాతీయ నాయకత్వం క్లాస్ పీకింది.   ప్రజాసంగ్రామ యాత్రలో తనకు ప్రాధాన్యతనివ్వడం లేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించిన సందర్భంలోనూ  బీజేపీ అధిష్టానం ఆయనను సముదాయించింది.  

తెలంగాణ బిజెపిలో అసంతృప్తి, అసమ్మతి మొలకెత్తిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధినాయత్వం జోక్యం చేసుకుని బండికి మద్దతుగా నిలబడి అసమ్మతిని మొలకలోనే తుంచేస్తోంది.  బండి సంజయ్ అరెస్టు సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి స్పందించగా, ప్రధానమంత్రి నేరుగా ఫోన్ చేసి బండిసంజయ్ ను పరమార్శించారు. అనంతరం మరో మారు తెలంగాణకు బిజెపి అధ్యక్షుడిగా ఆయననే నియమించడం ద్వారా రాష్ట్ర పగ్గాలు బండి చేతిలోనే ఉన్నాయనీ, ఉంటాయనీ స్పష్టం చేస్తోంది.

తెలంగాణలో బండి సంజయ్ కి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం  దుబ్బాక ఉప ఎన్నికలోనూ, జిహెచ్ఎంసి ఎన్నికలలోనూ, హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయాలు సాధించడం కూడా బండికి కలసి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.    తెలంగాణలో బీజేపీ గతంలో ఎన్నడూ ఇంత బలోపేతంగా లేదని పార్టీ హైకమాండ్ భావిస్తోందనీ, బండికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాతనే ఈ పరిస్థితి ఏర్పడిందనీ బీజేపీ అగ్రనాయకత్వం నమ్ముతోంది.  

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపియేనని జనం కూడా భావిస్తున్నారంటే అందుకు బండి నాయకత్వమే కారణమని హై కమాండ్ నమ్ముతోందని పార్టీ కేడర్ కూడా అంటున్నారు. అయితే ముందు ముందు ఇదే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాన్నీ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బండితో సమానంగా వాగ్ధాటి ఉన్న నేతలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లలో బండి పోకడలపై అసంతృప్తి వ్యక్తమౌతోంది.

అయితే హైకమాండ్ బండికి మద్దతుగా ఇస్తున్న సంకేతాలు వారిని ప్రస్తుతానికి మౌనం దాల్చేలా చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ గా బండి సంజయ్ అభివర్ణించిన ముగ్గురు ఎమ్మెల్యేలలోనూ కూడా పార్టీలో తమకు తగిన గుర్తింపు ప్రాధాన్యతా లేదన్న అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఈ పరిస్థితుల్లో పార్టీలో అసంతృప్తి మరింత పెచ్చరిల్ల కుండా హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

By
en-us Political News

  
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.