Publish Date:Nov 27, 2021
అతనో ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తుంటారు. ఆయనకు ఓ అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఆయన దృష్టికి వచ్చాయి. కొందరు ట్రక్కు డ్రైవర్లు పోలీసుల అక్రమాలపై ఎమ్మెల్యేను కలిసి వివరించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో అక్రమ వసూళ్ల సంగతి చూడాలని ఎమ్మెల్యే డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి పూట స్టింగ్ ఆపరేషన చేశారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని కన్నడ్ చాలీస్‌గ్రామం ఘాట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రక్కుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నది ఆ ఆరోపణ. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యే మంగేష్ చహ్వాణ్‌కు తెలియడంతో ఆయన ఈ ఆరోపణల్లోని నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో వైరల్ గా మారింది.
ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలో.. ముందుగా ఎమ్మెల్యే కొందరు డ్రైవర్లతో మాట్లాడటం కనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేతో.. తమ దగ్గర నుంచి ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా రూ. 500 నుంచి రూ. 2000 వరకూ వసూలు చేస్తున్నారని తెలిపారు. వీరి మాటలు విన్న ఎమ్మెల్యే ఒక ట్రక్కు ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చుని చెక్‌పోస్టు వరకూ వచ్చారు. అక్కడున్న ఒక కానిస్టేబుల్.. ఎమ్మెల్యే ఎక్కిన ట్రక్కును ఆపాడు. కిందకు దిగి రూ. 500 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఎమ్మెల్యే తన దగ్గర రూ. 300 మాత్రమే ఉన్నాయని వాటిని ఇస్తానన్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో మరోకానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. అతను ఎమ్మల్యేను దుర్బాషలాడాడు. దీంతో ఎమ్మెల్యే వాహనం నుంచి దిగారు. అతనిని గుర్తించిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు.
ఎమ్మెల్యే స్టింగ్ ఆపరేషన్ సమాచారం అందుకున్న ఔరంగాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లందరినీ విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగేష్ మాట్లాడుతూ తాను అక్రమాలకు పాల్పడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నానని, ఇక్కడి అధికార ఫ్రభుత్వంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంతటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇప్పుడు బయటపడిందన్నారు. ఎమ్మెల్యే మంగేష్ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్సాప్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-mla-on-police-bribe-vodeo-viral-in-maharashtra-39-127272.html
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.