ఈటల చేరిక లాభమా? నష్టమా? బీజేపీకి బూమరాంగ్? 

Publish Date:Jun 1, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కమలం గూటికి చేరుతున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ప్రతిపాదనను పక్కనపెట్టి.. కాంగ్రెస్ ఆహ్వనాన్ని కాదనుకుని, ఉద్యమకారుల వినతులను విడిచిపెట్టి .. కాషాయ కండువా కప్పుకుంటున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చినా.. బీజేపీలో ఈటల చేరిక ఎవరికి లాభమనే చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. రాజేందర్ రాకతో తమకు మరింత బలం వచ్చిందని, టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని, వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే ఈటల చేరికపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈటల చేరికతో తమకువచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని కొందరు కమలనాధులు అంచనా వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఇదేరకమైన చర్చ జరుగుతోంది. 

గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చాలా మంది నేతలు కమలం గూటికి చేరారు. అందులో మాజీ మంత్రుులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీడీపీలో కీలక పాత్ర పోషించిన మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి మోహన్ రావు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరారు. గరికపాటితో పాటు ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించిన టీడీపీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లలో చాలా మంది ఇప్పటికే బీజేపీలో తమకు సరైన ప్రాతినిద్యం లేదనే అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో గరికపాటి యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత ఎందుకో ఆయన సైలెంట్ అయ్యారు. బీజేపీ నుంచి తనకు అనుకున్నంతగా సపోర్ట్ లేకపోవడం వల్లే ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. వరంగల్ కు చెందిన గరికపాటి.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎక్కడా కనిపించలేదు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి... వరంగల్ బీజేపీ వ్యవహారాలు చూశారు. 

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీసీ నేత ఎర్రశేఖర్ ... బీజేపీలో ఇమడలేక ఇప్పటికే రాజీనామా కూడా చేశారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో స్థానికంగా పట్టున్న అంజయ్య యాదవ్ కూడా గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు ఎలా ఉన్నా.. పాత టీడీపీ నేతలు మాత్రం బీజేపీలో నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను తీసుకొచ్చి కీలక స్థానంలో నిలబెడితే వారంతా మరింత అసంతృప్తి లోనయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్టు వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బిజెపిలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని ఆయన హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటెలను ఎట్లా బీజేపీ లోకి తీసుకుంటారు.. ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు తనకు చెప్పడానికి ఏంటి బాధ.? అంటూ పెద్దిరెడ్డి బీజేపీ పెద్దల్ని ప్రశ్నించారు. ఈటలను బీజేపీలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి కుండబద్దలు కొట్టారు.ఈటల వ్యవహారం సామాజిక అంశం కాదు.. ఆర్థికపరమైన గొడవ అని   మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కామెంట్ చేశారు. ఆయన మంత్రి పదవి ప్రజల కొసమా.. కంపెనీల కోసమా అని ప్రశ్నించారు. దళితుల గురించి ఈటల ఏనాడైనా మాట్లాడారా.. ఆయనది ఆత్మ గౌరవం కాదు, ఆత్మ ద్రోహం అన్నారు నర్సింహులు. అంతేకాదు తనకు వందల ఎకరాలు, రూ.వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకుని ఈటల రాజేందర్‌ జీవితాంతం పూజ చేయాలన్నారు మోత్కుపల్లి నర్సింహులు. బీసీ నాయకుడికి మంత్రిపదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఈటల కృతజ్ఞతతో ఉండాలన్నారు. 

పెద్దిరెడ్డి ,మోత్కుపల్లి నర్సింహులు బాటలోనే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలంతా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాజేందర్ తో పాటు బీజేపీ దూకుడుకు చెక్ పెట్టాలని చూస్తున్న గులాబీ బాస్.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. గతంలో తనకున్న పరిచయాలతో పాత టీడీపీ నేతలకు ఆయన గాలం వేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రికి టచ్ లోకి వచ్చారంటున్నారు. ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్ మున్సిపాలిటీలోని ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు మంత్రి గంగుల సమక్షంలో గులాబీ జెండా పట్టుకున్నారు. పాలమూరుకు చెందిన ఎర్ర శేఖర్ కూడా త్వరలో గులాబీ గూటికి చేరుతారని అంటున్నారు. మోత్కుపల్లి కూడా కేసీఆర్ తో మాట్లాడుతున్నారని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి కోసం గతంలో కేసీఆర్ ప్రయత్నించారట. అప్పుడు ఆయన బీజేపీలో చేరారు. తాజా పరిస్థితులతో రేవూరిని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసీఆరే రంగంలోకి దిగారంటున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలందరిని కారు ఎక్కించేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

ఈటల రాజేందర్ పై దేవుడి భూములు, దళితుల భూములు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపైనే విచారణ జరుగుతోంది. ముఖ్యంగా దేవరయాంజల్ లోని సీతారామ ఆలయానికి సంబంధించిన భూముల అంశం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. రాముడి పార్టీ అని చెప్పుకునే బీజేపీ.. రామాలయ భూముల ఆక్రమించారనే ఆరోపణలు వస్తే స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రామాలయ భూముల పరిరక్షణ కోసం పోరాడకుండా.. కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేర్చుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని కొందరు కమలం నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఈటల విషయంలో సైలెంట్ గా ఉండే.. ముందు ముందు సమస్యలు వస్తాయని కొందరు ఆందోళన చెందుతున్నారట. రామాలయ భూముల గురించి మాట్లాడకుండా హిందుత్వ నినాదం చేసినా ఫలితం ఉండదనే అభిప్రాయం కొందరి నుంచి వస్తోంది.

మొత్తంగా ఈటల రాజేందర్ చేరికతో తమకు లాభం కంటే నష్టమేననే చర్చ బీజేపీ నేతల్లో తీవ్ర స్థాయిలోనే జరుగుతుందంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా వెళ్లిపోతే ఈటల వచ్చినా ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ ఈటల రాజేందర్ చేరికతో బీజేపీకి బూమ్ రాంగ్ తప్పదనే అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది.  

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.