విజయ సంకల్ప యాత్రలతో తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం

Publish Date:Feb 20, 2024

Advertisement

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లు ఇంకా ప్రచార పర్వం ప్రారంభించలేదు. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించేసింది. ఒక వైపు బీఆర్ఎస్ తో  పొత్తు వార్తలు ప్రచారం అలా సాగుతుండగానే, ఆ ప్రచారంతో సంబంధం లేకుండా బీజేపీ ఎన్నికల సమరానికి తన వంతుగా సన్నాహాలు ప్రారంభించేసింది.

పార్టీలో విభేదాలు ఆ పార్టీ విజయావకాశాలను మసకబారుస్తున్నాయన్న ప్రచారం ఓ వైపు సాగుతూనే ఉంది. బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో బండి సంజయ్ తప్ప మరెవరూ స్పందించడంలేదు. రాజకీయవర్గాలలో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ తో కలిసేందుకే మొగ్గు చూపుతోందన్న చర్చ సాగుతుంటే.. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ప్రశక్తే లేదని సభలలో కుండబద్దలు కొట్టేస్తున్నారు. అయితే వాస్తవంగా పొత్తులపై మాట్లాడాల్సిన అధిష్ఠానం కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో మౌనం పాటిస్తున్నారు. బండి సంజయ్ అయితే మాత్రం రాష్ట్రంలోని 17లోక్ సభ స్థానాలలోనూ బీజేపీ అభ్యర్థులు రంగంలో ఉంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆ పార్టీ మాత్రం కేంద్రంలో మోడీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక స్థానాలలో విజయం సాధించాలన్న సంకల్పంతో  తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించింది.  

 కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ , మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్   ఇతర నాయకులు ఈ యాత్రలలో పాల్గొంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ప్రారంభమైన యాత్రల్లో  బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను  ప్రజలకు వివరించారు.   ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఇస్ బార్…చార్ సౌ పార్ అనే నినాదాలతో యాత్రలు సాగుతున్నాయి.  

కొమురం భీం క్లస్టర్ లో  యాత్రను భైంసాలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ , ఎంపీ సోయం బాపురావు , ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్ , పాయల్ శంకర్ , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు. 

రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను వికారాబాద్ జిల్లా చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలోని తాండూరులో కేంద్రమంత్రి  బీఎల్ వర్మతో కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్   ప్రారంభించారు. ఈ యాత్రలో శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

భాగ్యనగర్ క్లస్టర్ యాత్రను న భువనగిరిలో  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ మాజీ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ , ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  పాల్గొన్నారు.

కృష్ణమ్మ క్లస్టర్ లో విజయ సంకల్ప యాత్రను నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామంలొ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల తో కలిసి కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ , జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి , రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్   మంగళవారం  మొత్తం 4 క్లస్టర్లలో  విజయసంకల్ప యాత్రలు జరిగాయి. 

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.