ఆత్మరక్షణలో కమల దళం!

Publish Date:Apr 4, 2023

Advertisement

భారతీయ జనత పార్టీ ( బీజేపీ) ఆత్మరక్షణ  పడిందా? ఓ పక్క నుంచి అదానీ వ్యవహారం, మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం అలాగే, ప్రతిపక్ష పార్టీలను ఏకం  చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనర్హత వివాదం.. ఇలా ఒక్క సారిగా  ముప్పేట దాడి ముంచుకొస్తున్న సమయంలో  బీజేపీ ఆత్మ రక్షణలో పడిందా?  అందుకే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెపుతున్న అవినీతి ఆరోపణలను మళ్ళీ మరో మారు తెర మీదకు తెస్తోందా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటన్నారు. ఈ నేపధ్యంలోనే  ‘కాంగ్రెస్ ఫైల్స్’ పేరిట పాత కథలను ఫ్రెష్  గా తెరపైకి ఎక్కిస్తోందని అంటున్నారు. 

నిజానికి, 2014కు ముందు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం ఎదుర్కోని అవినీతి ఆరోపణ ఏదీ లేదు.  కింద భూమి పైన ఆకాశం హద్దుగా ఇటు బొగ్గు నుంచి అటు స్పెక్ట్రమ్ వరకు అన్ని వ్యవహారాలలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. విచారణలు జరిగాయి.  ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ  ఈ ఆరోపణల కారణంగానే  2014 సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. భారీ మూల్యాన్ని చెల్లించింది. బీజేపీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. అయితే  ఆ తర్వాత ఆ కేసులు   విచారణలు  ఏమయ్యాయో  ఎటు పోయాయో ఎవరికీ తెలియదు.  కానీ, ఇప్పడు బీజేపీ దాచేస్తే దాగని సత్యాలంటూ పాత అవినీతి కథలను కాంగ్రెస్ ఫైల్స్ పేరిట  వరస వీడియోలను విడుదల చేస్తోంది.
అందులో భాగంగా  తాజాగా కాంగ్రెస్ ఫైల్స్  మూడో ఎపిసోడ్‌ను బీజేపీ  ట్విటర్ ఖాతాలో షేర్‌ చేసింది. అందులో 2012లో జరిగిన బొగ్గు కుంభకోణం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ  అవినీతి మరకలను మళ్ళీ మరోమారు గుర్తు చేసింది.  మన్మోహన్‌ సింగ్ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన అనేక హామీలు కురిపించారు.

కానీ  కాంగ్రెస్‌ కుంభకోణాలే అప్పుడు హెడ్‌లైన్లలో వచ్చాయి. అందులో ప్రధానమైనది బొగ్గు కుంభకోణం. దీని కారణంగా మన దేశం రూ.1.86లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2004-2009 మధ్య ఈ కుంభకోణం చోటుచేసుకుంది ఆ సయమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, శిబు సోరెన్‌ చేతుల్లో ఉంది. కాంగ్రెస్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఆదేశాలతో ఈ ప్రధాని పనిచేశారు  అని బీజేపీ తాజా ఎపిసోడ్ లో వివరించింది.

అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ  మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ  అదానీ, మోడీ సంబంధాలను  ప్రశ్నిస్తున్న నేపధ్యంలో  బీజేపీ అందుకు కౌంటర్ గా గత మూడు రోజులుగా, కాంగ్రెస్‌ అవినీతి పై రోజుకో వీడియోను విడుదల చేస్తోంది. మొదటి ఎపిసోడ్‌ను ట్రైలర్‌ అని పేర్కొన్న బీజేపీ, కాంగ్రెస్‌ పాలనలో రూ.4.82 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించింది. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో ఎంఎఫ్‌ హుస్సేస్‌ పెయింటింగ్స్‌ వివాదాన్ని ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ నుంచి ఎంఎఫ్‌ హుస్సేన్‌ పేయింటింగ్‌ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ తనను బలవంతపెట్టిందని యస్‌బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌ ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆ వీడియోలో చూపించింది. అందుకు బదులుగా పద్మభూషణ్‌ ఇప్పిస్తామని హస్తం పార్టీ తనకు హామీ ఇచ్చినట్లు రాణా కపూర్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఇప్పుడు తాజగా మనోమోహన్ సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ కి మచ్చ తెచ్చిన బొగ్గు కుంభకోణం కేసును తెరకేక్కించింది. అదానీ గ్రూప్‌ కంపెనీల వ్యవహారం, రాహుల్‌ అనర్హత వంటి అంశాలపై విపక్షాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో బీజేపీ ఈ వీడియోలు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 2014కు ముందు ప్రతిపక్షంలో బీజేపీ ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వశించారు. కానీ  ఎనిమిదేళ్ళకు పైగా అధికారంలో ఉండి ఎమీ చేయని బీజేపీ ఇప్పడు పాత ఫైల్స్ కు దుమ్ము దులిపి,  కాంగ్రెస్ ఫైల్స్  అంటూ కాంగ్రెస్ పార్టీ పై బురద చల్లితే  ప్రజలు నమ్ముతారా? నవ్వుకుంటారా?

By
en-us Political News

  
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.