ముర్మూకి టిడీపి మ‌ద్ద‌తు.. సందిగ్ధంలో బిజెపి

Publish Date:Jul 12, 2022

Advertisement

సామాజిక న్యాయం విషయంలో రాజకీయపార్టీలు  కట్టుబడి వుండాలి.  రాజకీయపార్టీలు తమ సిద్ధాంతా న్ని ప్రచారం చేసుకోవడంతోపాటు అభ్యర్ధి  ఎన్నిక విషయంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇపుడు తెలుగు దేశం పార్టీ తాను సామాజిక న్యాయానికి కట్టుబడి వుందన్న ది మరోసారి రుజువు చేసుకుంది.

రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్దిగా బిజెపి కూటమి ప్రకటించిన  ద్రౌపది ముర్ముకి తెలుగు దేశంతో పాటు వైసీపీ కూడా మద్దతు తెలపాల్సి వచ్చింది. కారణం ముర్మూ సామాజికంగా వెనుకబడిన గిరిజన తెగకు చెందినవారు  కావడమే. ఆమెను రాష్ట్రపతిగా చూడాలన్న ఆకాంక్ష క‌లిగి వుండ‌డ‌మే తెలుగుదేశం మ‌ద్ద‌తు నిచ్చి వుండ‌వ‌చ్చు.  ఒక్క‌సారి గ‌తంలోకి వెళితే, 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదంటూ ఆగ్ర‌హించి తెలుగుదేశం ఎన్‌డిఏ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చింది. బిజెపి వ‌ర్గాలు టిడిపిని అప్ప‌టి నుంచి శ‌తృవుగానే చూస్తున్నాయి. కానీ ముర్మూ అభ్య‌ర్ధిత్వం విష‌యంలో చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం బిజెపి వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచి వుండ‌వ‌చ్చు. త‌మ‌తో అనేకాంశాల్లో విభేదించిన బాబు ఇప్ప టి నిర్ణ‌యం బిజెపి వ‌ర్గాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. బిజెపితో అంట‌కాగుతున్న వైసీపీ మ‌ద్ద‌తు నిచ్చిన అభ్య‌ర్ధిని టిడీపీ అంగీక‌రించ‌డం వూహించ‌ని ప‌రిణామ‌మే. ఎన్డీయే లేదా విపక్ష కూటమి తమ మద్దతు కోరిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని టీడీపీ  భావిస్తూ వచ్చింది. లేకుంటే తటస్థంగా ఉండాలనే ఆలోచన ఒక దశలో చేసింది. 

కానీ, ఎన్నికలకు కేవలం వారం మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము అమరావతికి రానున్న‌ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేతో చర్చించిన చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ప్రతి పాదించిన గిరిజిన మహిళ ముర్ముకు మద్దతు గా నిలవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ ముర్ముకు మద్దతు ప్రకటిం చింది. రాష్ట్రపతి ఎంపిక సమయంలో ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్  సీఎం జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని పేర్ని నాని  అధికారికంగా వెల్లడించారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో  వైసీపీ మద్దతు కోరలేదంటూ కొందరు బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని ఈ విధంగా  సమా ధానం ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి షెకావత్ సైతం వైసీపీ మద్దతు కోరామని స్పష్టత ఇచ్చారు. కానీ చంద్రబాబు మద్దతు మాత్రం బీజేపీ కోరలేదు.అయినా చంద్రబాబు ఎన్డీఏకు మద్దతు తెలిపింది.  ఇది బిజెపి నాయ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కానీ సామాజిక న్యాయం ప‌ట్ల ఎంతో న‌మ్మకాన్ని టిడీపీ ఈ విధంగా ప్ర‌క‌టించింద‌న్న‌ది ప్ర‌జ‌లు గుర్తించారు. 

2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏయేకు దూరం అయిన చంద్రబాబు తిరిగి ఇప్పుడు ఎన్డీయే అభ్యర్ధికి మద్ద తు ప్రకటించటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గతంలోనూ ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ, వైసీపీ ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన రామ్ నాధ్ కోవింద్ కు మద్దతిచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. టీడీపీ తొలి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో చెప్పా రు. 2014 ఎన్నికలు సమయంలో టి.డి.పి.,బి.జె.పి జనసేన కలిసి పోటిచేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా తెలుగుదేశం పార్టీ కూట‌మి  నుంచి  బయటకి  వచ్చేసింది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.