పవన్ కు బీజేపీ నుంచి పిలుపు.. పవన్ వ్యాఖ్యలతో కమలంలో కుదుపు

Publish Date:Oct 19, 2022

Advertisement

మంగళగిరిలో మంగళవారం జరిగిన జనసేన కార్యకర్తల సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. మిత్రపక్షమైనా బీజేపీతో కలిసి నడవడానికి రాష్ట్రంలో ఆ పార్టీ  నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పెద్ద అవరోధంగా మారిందని పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హై కమాండ్ లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించింది. జనసేనాని పవన్ కల్యాణ్ ను హస్తిన రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింద. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే మంగళవారంమే పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తన అధిష్టానానికి ఏమి వివరణ ఇచ్చారో.. ఏమో గానీ.. బుధవారం మధ్యాహ్నానికల్లా సీన్ మారిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

‘నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖచిత్రం చూస్తారు’ అంటూ జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో సమయం గడిచిపోతోందంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే బీజేపీ వర్గాల్లో కంగారుకు కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి సుమారు గంట సేపు ప్రైవేటుగా చర్చలు జరపడం కూడా బీజేపీలో కంగారు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మీద, మోడీ మీద తనకు గౌరవం ఉందంటూనే   ‘అలా అని చెప్పి నా స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేను’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలం పెద్దలను ఇరుకున పెట్టాయని పరిశీలకులు అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడుస్తారని ఇప్పటి దాకా   బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు ప్రకటించడంతో కమలం పార్టీకి గాలి ఆడని పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

నిజానికి బీజేపీ- జనసేన మధ్య 2019 ఎన్నికల తరువాత నుంచీ పొత్తు ఉంది. అయితే  చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడప్పుడూ చెబుతున్నా కొంతకాలంగా ఆ రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉద్యమం కానీ కార్యక్రమం కానీ నిర్వహించలేదు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు రెండు రోజులు ఆయన బసచేసిన హొటల్ నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఆదివారంనాడు విజయవాడకు తిరిగివచ్చి ‘ఇక్కడే తేల్చుకుంటా’ అని చెప్పడం.. మంగళగిరి ఆఫీసులో తమ పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు.

విశాఖ ఘటన తర్వాత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి, మద్దతు తెలిపినప్పటికీ తనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిన దాఖలాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదు. మరో పక్కన విశాఖ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరి కంటే ముందుగా స్పందిచి పవన్ కు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం..  మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కు కలసి సంఘీభావం తెలపడంతో   బీజేపీ నేతల్లో కంగారు మొదలైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని అంచనా వేస్తున్నారు.

 పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని బాంబు పేల్చడం గమనార్హం. పవన్ తో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమయ్యారని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.

అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి సెగలు హస్తినను కూడా తాకడంతోనే పవన్ కల్యాణ్ కు బీజేపీ హై కమాండ్ నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.  

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.