వైసీపీ పాపాలలో బీజేపీకీ భాగం?!

Publish Date:Jun 17, 2023

Advertisement

జగన్  పాలన అంతా  అవినీతి,అరాచకం,అప్పులేనంటూ ఇప్పుడు మన్నూ మిన్నూ ఏకం చేస్తూ విమర్శలు గుప్పించిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు.. అందుకు ఈ నాలుగేళ్లూ అండగా, దండగా నిలిచినందుకు మాత్రం ఇసుమంతైనా విచారం కానీ, పశ్చాత్తాపం కానీ వ్యక్తం చేయలేదు.  కేంద్ర పథకాలపై జగన్‌ తన బొమ్మ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు గుప్పించిన ఆ నేతలు ఇంత కాలం ఎందుకు నోరు మెదపలేదన్న జనం ప్రశ్నకు సమాధానం చెప్పేందుందుకు ఎందుకు సిద్ధంగా లేరు.

 పేదల కోసం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారని, విశాఖపట్నాన్నిభూ రాబందుల కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను దుయ్యబట్టిన ఆయ నాయకద్వయం.. అందుకు అన్ని విధాలుగా సహకరించినా.. తాము మాత్రం నిజాయితీపరులమని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకి పైగా  రాష్ట్రానికి ఇచ్చామనీ, ఆ డబ్బంతా ఏమైందనీ ఇంత కాలం ప్రశ్నించకుండా ఇప్పుడు నిలదీయడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బుకు సరిపడా అభివృద్ధి కనిపించడం లేదని చెబుతున్న అమిత్ షా.. అభివృద్ధి కనిపించడం లేదని ఇప్పుడే తెలిసిందా? ముందే తెలిస్తే.. ఎందుకు జగన్ సర్కర్ ను నిలదీయలేదని అంటున్నారు.  

మైనింగ్‌, భూ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ ఇలా అన్నిటిలోనూ వైసీపీ నాయకులే ఉన్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జగన్ పరిపాలనపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, మాజీ సీఎం కు స్వయానా సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ కు సొంత బాబాయ్ వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా పురోగతి కనిపించకపోవడాన్ని ఎందుకు నిలదీయలేదంటున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించి, వివేకా శరీరంపై గాయాలకు కుట్లువేసి బ్యాండేజీలు వేసినా, అందుకు పాల్పడిన వారిని, పోనీ ఆక్రతువునంతా దగ్గరుండి చేయించిన వారినీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కనిపెట్టలేకపోవడం వెనుక ఉన్న హస్తం ఎవరిదన్న విషయంపైనా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని ఏపీ జనం నిలదీస్తున్నారు. ఇక అన్నిటికంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేసి ఏపీ రాజధానిగా ప్రకటించిన అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ఈ నాలుగేళ్లుగా జరిగిన అన్ని ప్రయత్నాలనూ  ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం వెనుక ఉన్న కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు.

జగన్ రెడ్డి పాలనలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ధ్వజమెత్తిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఇప్పుడే ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పటికైనా జగన్ రెడ్డి పాలన దౌర్భాగ్యంగా ఉందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గుర్తించడం సంతోషమే కానీ, ఇంత కాలం ఏపీలో జగన్ అరాచక పాలనను అన్ని విధాలుగా సమర్ధిస్తూ, ఆర్థిక అరాచకత్వాన్ని మరింత ప్రోత్సహించే విధంగా నిబంధనలను తుంగలో తొక్కి మరి అప్పులిచ్చి ఏపీని అధ్వాన స్థితికి తేవడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పాత్ర ఎంత ఉందో పరిశీలకులు సోదాహరణంగా చేస్తున్న విశ్లేషణలకు  షా, నడ్డా ద్వయం సమాధానం చెప్పాలని ఏపీ జనం కోరుతున్నారు.  

నాలుగేళ్లుగా పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం అంటకాగిన వైసీపీ, బీజేపీలు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలను మరో సారి మోసం చేయడానికి తెరతీసిన కొత్త డ్రామాగా అమిత్ షా, నడ్డాల విమర్శలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత నాలుగేళ్లుగా  జగన్ రెడ్డి దుష్టపాలనకు వెన్నుదన్నుగా నిలిచి,   ఆర్ధిక అరాచకానికి అండగా నిలుస్తూ జగన్ సర్కార్ ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు విమర్శల దాడికి దిగడం వెనుక రాజకీయ ప్రయోజనాభిలాషను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 జగన్ పాలన అంతా అవినీతి, అక్రమాలు, కుంభకోణాల మయం అంటూ గగ్గోలు పెట్టిన అమిత్ షాకు (ఆయన కేంద్ర హోంమంత్రి) జగన్ పై వున్న 16 చార్జి షీట్ల పై విచారణ  నిలిచిపోయిందన్న సంగతి తెలియదా. ఆయన కోర్టుకు హాజరు కాకుండా సాధించుకున్న వెసులుబాటు వెనుక ఎవరు ఉన్నదో ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.