కొన్ని అందరికీ తెలిసే జరుగుతాయి. మరికొన్ని జరిగిన తర్వాతే తెలుస్తాయి. కొన్నింటికి వ్యూహ రచన చాలా రోజుల క్రితమే జరుగుతుంది. జరిగిన తర్వాత అందరూ ఆశ్చర్యపడతారు. మహారాష్ట్ర సంక్షోభానికి తెరపడటం, శివసేన నాయకుడు షిండే ముఖ్యమంత్రి కావడం మూడవ కోవలోకే వస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ఫడ్నవీస్‌ను అనుకుని ఆనక షిండేను ప్రకటించడం, ఫడ్నవీస్‌ని ఉప ముఖ్య మంత్రిని చేయడం చాలామందిని ఆశ్చర్యపరచింది. చివరి నిమిషంలో ఈ మార్పు వ్యవహారం అంతా వాస్తవానికి బిజెపీ వ్యూహమే. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులుచేర్పులు చేసిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
మొదట ఫడ్నవీస్ బయటనుంచే మద్దతునిస్తానని అన్నారు. కానీ ఆయన్ను ఉపముఖ్యమంత్రిగా వుం డేందుకు అంగీకరించేలా చేయడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి ఛీఫ్ నడ్డా రంగం లోకి దిగాల్సి వచ్చింది. సరే పార్టీ పెద్దలంతా చెబుతున్నారు గనుక ఫడ్నీవీస్ సరే అనకా తప్పలేదు. గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఇపుడు ఉప ముఖ్యమంత్రిగా చేయడానికీ అంగీకరించిన రాజకీయ నాయ కులలో ఫడ్నవీస్ నాలుగవ స్థానంలో వున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ఈ విధంగా పద వుల్లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా శివసేనను చీల్చినట్టే అయింది. అంతేకాదు ఎన్‌సిసి అధినేత శరద్ పవార్‌కు మహారాష్ట్రలోనే పెను సవాల్ విసిరినట్టు అయింది. పవార్ పశ్చిమ మహారాష్ట్ర సతారాకు చెందిన నాయకులు. అక్కడి నుంచి వచ్చిన యువ నాయకుడు షిండే!
మహారాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంక్‌ను మాధవ్ అని తొలినాళ్లలో పిలిచేవారు. మాధవ్ అంటే మాధవుడు కాదు. మాలి, ధనగీర్, వంజారా కమ్యూనిటీలు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత ఓబిసీ, అర్బన్ ఓటర్లకు బిజెపి ప్రచారాలు, పిలుపులు బాగా ఆకట్టుకున్నాయి. బిజెపి పట్ల మొగ్గు చూపారు. ఇక ఇపుడు ఏకంగా మరాఠా రాజకీయ నాయకుడినే ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బిజెపి వారి దృష్టిలో మహో న్నతంగా ఎదిగింది. ఇది తప్పకుండా వారికి 2024 ఎన్నికల్లో 32 శాతం మరాఠా ఓట్లు పడడానికి ఎంత యినా ఉపకరిస్తుంది.
షిండేను ముఖ్యమంత్రి చేయడంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిజెపి చిన్నపాటి హెచ్చరిక చేసినట్టయింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయినప్పటికీ మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీవారికి కాకుండా హిందూత్వ రక్షణ ఆలోచనతోనే శివసేనకు చెందిన షిండేకు కట్టబెట్టామని చెప్పుకుంటోంది. అందువల్ల పెద్ద వ్యూహమే షిండేను మంత్రించింది! 2019 ముంబయి నగర మేయర్ ఎన్నికల్లో కూడా బిజెపి ఎన్నికల్లో పోటీ చేయ కుండా శివసేనకే ఆ పదవి దక్కించుకునేందుకు వీలు కల్పించింది. బిజెపి కుటుంబపాలనను తిరస్క రిస్తుంది. థాక్రే కుటుంబం మహారాష్ట్రను ఏలడానికి బిజెపీ వర్గీయులకు ససెమీరా నచ్చలేదు. అందుకే చిన్న స్థాయినుంచి శివసేనలో చెప్పుకోదగ్గ నాయకునిగా నిలిచి ఏకంగా థాక్రేకు ఝలక్ ఇవ్వగలిగిన షిండేను ముఖ్యమంత్రిని చేయడంలో బిజెపి ఆలోచన అనన్య సామాన్యం. ఇదంగా 2024 ఎన్నికల్లో సత్తా చాటడానికి ముందస్తుగా పావులను కదుపుతూ విపక్షాలకు నిద్ర లేకుండా చేయాలన్న వ్యూహరచనేై!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-game-plan-39-139058.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.