ఇలాంటి నేతలతో ప్రయోజనమేంటీ! వలసలపై బీజేపీలో చర్చ

Publish Date:Nov 27, 2020

Advertisement

తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని నేతలను ఆహ్వానిస్తున్నారు కమలనాథులు. బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలిస్తూ.. ఆ పార్టీలోకి భారీగానే వలసలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కమలం కండువా కప్పుకోగా.. మరికొందరు నేతలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.  మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నేతలు కాషాయ గూటికి చేరుతున్నారు. అయితే  పార్టీలో జరుగుతున్న చేరికలపై బీజేపీలోనే భిన్న స్పందన వస్తుందనే ప్రచారం జరుగుతోంది. స్వామి గౌడ్ వంటి నేతలు ఫర్వాలేదు కాని.. ప్రజా బలం లేని లీడర్ల కోసం ప్రయత్నించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని  పడితే వారిని చేర్చుకోవడం వల్ల..అద్వానీ, వాజ్ పేయి వంటి మచ్చలేని నేతలు నడిపించిన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. 

 

బీజేపీలోని కొందరు నేతలు భయపడుతున్నట్లే ఆ పార్టీలోకి తాజా వలసలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీలో పనిచేసి వెళ్లినవారు, ఏనాడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవని వారు, మీడియాలో ఫోకస్ కావడం తప్ప ప్రజల్లో పలుకుబడి లేని వారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ  నిత్యం వార్తల్లో ఉండేవారు, గొడవలు పడుతూ కాంట్రవర్సీగా ఉండే నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీలోకి జరిగిన వలసలు చూసినవారు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి, సర్వే సత్యనారాయణ, విక్రం గౌడ్, గూడురు నారాయణ రెడ్డి వంటి వారితో పార్టీకి ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువుంటాయనే గుసగుసలు బీజేపీ కార్యాలయంలో వినిపిస్తున్నాయి. 

 

విజయశాంతి రాజకీయ జీవితం బీజేపీతోనే ఆరంభమైంది. ఇప్పటి వరకు ఆమె నాలుగు  పార్టీలు మార్చేసింది. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేసింది. 1998లో బీజేపీలో చేరింది విజయశాంతి. కొంత కాలానికే బీజేపీ నుంచి బయటికొచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసింది రాములమ్మ. 2009లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కొద్ది రోజులకే కేసీఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.  2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్  లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2018 ఎన్నికల తర్వాత నుంచి ఆమె రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. రాజకీయాల్లో నిలకడ లేని రాములమ్మ చేరికతో బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏమిటన్న చర్చ బీజేపీలోనే జరుగుతోంది. 

 

కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా బీజేపీలో చేరారు. సర్వేకు పెద్ద కేడర్ కూడా లేదు. ఆయనకు సొంత నియోజకవర్గం కూడా లేదు. గత ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇప్పుడాయన పార్టీలో చేరితే ఉపయోగం ఏంటన్నది కొందరు కమలనాధుల వాదన. ఎప్పుడూ  వివాదాస్పద కామెంట్లతో కాంట్రవర్సిగా ఉండే సర్వేతో కమలానికి నష్టమే తప్ప  లాభం ఉండదనే చర్చ కమలనాధుల్లో జరుగుతుంది.సర్వే లాంటి నేతలు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. గతంలో ఆయన చేసిన కామెంట్లు చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాయి. బీజేపీ నేతగానూ ఆయన నోరు జారితే పార్టీకి తీరని నష్టం జరగవచ్చనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతల నుంచి వస్తుందని చెబుతున్నారు.అంతేకాదు సర్వేతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారనే విషయం తెలిసాకా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందిగా మారాయి.తాము వద్దనుకుని వదిలించుకున్న నేతలను బీజేపీ తీసుకుంటుందనే కాంగ్రెస్ నేతల కామెంట్లకు కమలనాధుల దగ్గర కౌంటరే లేకుండా పోయింది. 

 

మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కూడా బీజేపీలో చేరబోతున్నారు. విక్రం గౌడ్ రాజకీయాల్లో పూర్తిగా విఫలమైన వ్యక్తి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అతన్ని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన విక్రం గౌడ్ తన డివిజన్ లో మూడో స్థానంలో నిలిచి ఘోరంగా ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషా మహాల్ నుంచి పోటీ చేసి కనీస పోటీ కూడా ఇవ్వలేదు. మూడేండ్ల క్రితం విక్రం గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసుల విచారణలో .. విక్రం గౌడే కిరాయి గ్యాంగుతో తనపై దాడి చేయించుకున్నాడని తేలడంతో అతని పరువు పోయింది. డివిజన్ లో కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి బీజేపీలోకి వస్తే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటన్నది కమలం కార్యకర్తల ప్రశ్న. పీసీసీ కోశాధికారిగా ఉన్న గూడురు నారాయణ రెడ్డి కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం ఉంది. మీడియాలో ఫోకస్ కావడం తప్ప జన బలం లేని గూడూరు లాంటి నేతలతో పార్టీకి ప్లస్ అయ్యేది ఏమి లేదని బీజేపీలో చర్చ జరుగుతోంది. 

 

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. కొత్తగా వచ్చిన నేతలు కార్పొరేటర్ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వలస నేతలకు టికెట్లు ఇవ్వడంపై పార్టీలో నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లో  మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ఆందోళన చేశారు. అంతేకాదు కొత్తగా వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరిగిందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీలో చేరుతున్న నేతలతో భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలో ఇప్పటికే బలమైన నేతలు ఉన్నారని, పార్టీ బలోపేతానికి అవసరమయ్యే నేతలను తీసుకుంటే సరిపోతుందని కొందరు నేతలు చెబుతున్నారు. ప్రజా బలం లేని, వివాదాస్పదంగా ఉండే నేతలను తీసుకుంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.