‘గ్రేటర్’లో బీజేపీ ‘పంచ’తంత్రం!

Publish Date:Nov 17, 2020

Advertisement

సంజయ సారథ్యంలో కమలం సమరోత్సాహం

 

చేరికలతో ఎన్నికల కోలాహలం

 

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే గందరగోళం

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధానికి కమలదళం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు సంజయ్ సారథ్యంలో పంచతంత్రం ప్రణాళిక సిద్ధమవుతోంది. దుబ్బాక విజయోత్సాహంతో ఊపు మీదున్న కమలదళాలు, గ్రేటర్ ఎన్నికల్లో మేయర్‌ను పట్టేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  సంజయ సారథ్యంలో గ్రేటర్‌లోని మెజారిటీ డివిజన్లను సాధించేందుకు ఐదుగురు అగ్రనేతలతో కమలదళం ఎన్నికల బరిలోకి దిగనుంది.

 

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బండి సంజయ్ సారథ్యంలోని కమలదళం, అస్త్రశస్ర్తాలతో రంగంలోకి దిగుతోంది. ప్రస్తుతం రాజధాని నగరంలో బీజేపీకి ఒక ఎమ్మెల్యే, నలుగురు  కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి గ్రేటర్‌పై పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉన్న కమలదళానికి, ఇటీవలి దుబ్బాక విజయం ఒక టానిక్‌లా మారింది. దానికితోడు టీఆర్‌ఎస్-కాంగ్రెస్ నుంచి వరసగా చేరుతున్న వలసలతో,  బీజేపీలో సమరోత్సాహం తొంగిచూస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటరు కూడా కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

 

వీరుకాకుండా, ఎన్నికల ముందు వరకూ మరింతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇది  ఆ పార్టీలో జోష్‌ను పెంచుతోంది. దుబ్బాక విజయం తర్వాత, నగరంలో కూడా బీజేపీ ట్రెండ్ కొనసాగుతుందన్న అంచనాయే,  ఈ వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానితో పోటీ చేసే ఆశావహ అభ్యర్ధుల  సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ఉత్సాహం చూసి అగ్రనేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న,  సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో చేరికల సంఖ్య పెరుగుతోంది. టీఆర్‌ఎస్ అసమ్మతులపై ఆయన కన్నేయడంతో, నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీలో చేరేందుకు క్యూలు కడుతున్నారు.

 

ఇక గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగుర వేయాలన్న కలను నిజం చేసేందుకు,  పార్టీ దళపతి సంజయ్ ఇప్పటికే రంగంలోకి దిగారు. కేంద్రమంతి కిషన్ రెడ్డి కన్వీనర్‌గా 23మందితో ఎన్నికల కమిటీని ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్చార్జిగా నియమించారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారబరిలో సంజయ్‌తోపాటు, కిషన్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, డికె అరుణ దిగనున్నారు. వీరిలో అంతా ఫైర్‌బ్రాండ్లే. కేసీఆర్ సర్కారును దునుమాడేందుకు, ఈ పెద్దనోరు నేతలు రంగంలోకి దిగితే ఇక ఎన్నికల యుద్ధం అంతా ఆసక్తికరమే. వీరిలో సంజయ్-అర్వింద్-అరుణ త్రయం సంగతి చెప్పనవసరం లేదు. ఈ  ‘పంచ’తంత్రం ఎన్నికల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. గత ఎన్నికల్లో బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం ఓట్లు సాధించింది. అయితే కేవలం నలుగురు కార్పొరేటరు సీట్లు మాత్రమే గెలిచింది. అంతకుముందు.. టీడీపీతో పొత్తులో పోటీచేసిన బీజేపీ డిప్యూటీ మేయర్, ఒక స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తోపాటు 14 సీట్లు సాధించింది. ఆ సమయంలో బీజేపీ  5 ఎమ్మెల్యే స్థానాలు కూడా సాధించింది. టీడీపీతో తెగతెంపుల తర్వాత, బీజేపీ స్థానాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.

 

ఇప్పుడు మళ్లీ గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యంలో.. కనీసం 70 స్థానాల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో, సంజయ దళం తీవ్రస్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ప్రచార కమిటీతో సంజయ్ ప్రతిరోజూ భేటీ అవుతున్నారు. కిషన్‌రెడ్డి నగరంలోనే తిష్టవేశారు. ఏకంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పర్యవేక్షకుడిగా వస్తున్నారంటే, ఈ ఎన్నికలను బీజేపీ ఏ స్ధాయిలో ప్రతిష్ఠగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. 

 

కులాలు-ప్రాంతాలు-మతాల ప్రాతిపదికన ప్రచారంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు టీఆర్‌ఎస్ డివిజన్‌కు ఒక ఎమ్మెల్యేను పర్యవేక్షకుడిగా నియమిస్తున్న నేపథ్యంలో, బీజేపీ సైతం అందుకు దీటుగా నేతలను ఎంపిక చేస్తోంది. సెటిలర్లు ఉన్న డివిజన్లలో ప్రచారం చేసేందుకు, ఏపీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చే యోచన చేస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ కాబట్టి, ఏపీ నేతలు ప్రచారానికి వస్తే ప్రాంతం ముద్ర పడే ప్రమాదం లేదు. కాగా కరోనా కష్టకాలంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సొంతంగా,  తన 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పేదలను ఆదుకున్న వైనం కూడా,  పార్టీకి కలసివస్తుందని నేతలు చెబుతున్నారు. కరోనా కాలంలో, కిషన్‌రెడ్డి భార్య వివిధ నియోజకవర్గాల్లో నిత్యావసర వస్తువులు సమకూర్చిన విషయం తెలిసిందే.

 

కాగా, గ్రేటర్‌లో పార్టీ విజయావకాశాలు పెరుగుతున్నందున.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్-టిడిపి నుంచి చేరిన నేతలు టికెట్లకు పోటీ పడుతుండటంతో, అభ్యర్ధుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది. దీర్ఘకాలం నుంచి పార్టీకి పనిచేస్తున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇస్తే, అది గెలుపుపై ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. పైగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు, తమ సహజ లక్షణాల ప్రకారం కింది స్ధాయిలో పనిచేయకుండా.. కేవలం ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనలు, గతంలో తమ పార్టీల నుంచి బీజేపీలో చేరిన అగ్ర నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, లాబీయింగ్‌కు తెరలేపడం కింది స్ధాయిలో గందరగోళానికి కారమవుతోంది. కొత్తగా చేరిన నేతల వల్ల, పార్టీలో ఎప్పుడూ లేనన్ని గ్రూపు రాజకీయాలు పెరిగాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. తొలి నుంచీ పనిచేస్తున్న కార్యకర్తలు- నేతల ఆత్మస్థైర్యం దెబ్బతిని, అది పరోక్షంగా పార్టీ ఓటమికి దారితీసే ప్రమాదం లేకపోలేదని పార్టీ సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యను  నాయకత్వం,  ఎలా పరిష్కరిస్తుందో చూడాలి!

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.