ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అగ్నిపరీక్షే

Publish Date:Jan 15, 2023

Advertisement

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌ మేఘాలయల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి   అగ్నిపరీక్ష అనే చెప్పాలి. ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎన్నికల తేదీ లను ప్రకటించలేదు కానీ, ఎన్నికలు ఫిబ్రవరి లేదా, మార్చిలో జరిగే అవకాశం ఉంది. త్రిపురలో బీజేపీ రాష్ట్ర శాఖలో కొద్ది రోజులుగా వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేబ్‌   పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఈ రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆదివాసీ ఐ.పీ.ఎఫ్‌.టీ అలక పాన్పు ఎక్కింది. ఈ రెండు పార్టీలు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రద్యోత్‌ కిషోర్‌ దేబ్‌ బర్మ నాయకత్వంలోని తిప్రా మోతా   బలం పుంజు కుంటోంది. ఈ పార్టీ అక్కడ ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం కోసం  పోరాటం సాగిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తేనె తుట్టెను కదల్చినట్టవు తుందని బీజేపీ పాలకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతు న్నారు. విచిత్రమేమింటే, ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకుండా ఐ.పీ.ఎఫ్‌.టీ కూడా విజయం సాధించే అవకాశం లేదు.

ఇది ఇలా ఉండగా, చాలాకాలం ఇక్కడ అధికారంలో ఉన్న సీ.పీ.ఐ(ఎం) కూడా మళ్లీ అధికారంలోకి రావడానికి  వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, తిప్రా మోతీ పార్టీలతో పొత్తు కుదర్చుకో వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మార్క్సిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాదు, 2021 శాసన సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించినప్పటి నుంచి త్రిపుర మీద కన్నేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ మొత్తం 60 స్థానాలలోనూ ఒంటరిగా పోటీ చేయడానికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది.

దీని వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్క చేయడం లేదు. ఈ రాజకీయ పరి ణామాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్ద సవాలుగా పరిణమించనున్నాయి. ఈ పార్టీలను ఎదుర్కోవడం బీజేపీకి ఆషామాషీ వ్యవహారం కాదు కానీ, ఓట్లు చీలకుండా నివారించడానికి ఆ పార్టీ ఎత్తులు వేయక తప్పకపోవచ్చు. 

ఇక మేఘాలయ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎన్‌.పీ.పీ అనే స్థానిక పార్టీతో పొత్తు ఉంది. అయితే, ఇక్కడి ఎన్‌.పీ.పీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా తాము ఇక ఏ మిత్రపక్షంతోనూ సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించేశారు. ఈ  రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ప్రవేశ పెట్టడానికి ఆయన పూర్తి విముఖంగా ఉన్నారు. అంతే కాక, పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రంతో ఈ రాష్ట్రానికి సరిహద్దు సమస్యలున్నాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. గత నవంబర్‌లో అస్సాంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య పొరపచ్చాలకు కారణమైంది. ఈ స్పర్ధల నుంచి బయటప డడానికి, మళ్లీ పొత్తును సాధించడానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.

 నాగాలాండ్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అస్సాంతో నాగా లాండ్‌కు కూడా సరిహద్దు సమస్యలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వంటివి ఉన్నాయి. నాగాలాండ్‌లో బీజేపీ, నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ పేర తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని ఇప్పుడు ఈ సంస్థ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం విషయం లో ఎన్‌.ఎస్‌.సీ.ఎన్‌-ఐఎం అనే పార్టీతో చాలా కాలం బీజేపీ చర్చలు జరిపింది

కానీ, ప్రస్తుతం ఆ చర్చ ల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నాగాలకు ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం కావాలని ఎన్‌.ఎస్‌. సీ.ఎన్‌- ఐఎం కూడా డిమాండ్‌ చేస్తోంది. ఏతావతా, ఈ మూడు రాష్ట్రాలలో ఈసారి జరగబోయే ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఈ రాష్ట్రాలలో ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ, ఆ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇంతవరకూ ప్రస్తావించని అంశాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఈ పార్టీల్లో కొందరు నాయకులు ఢిల్లీ స్థాయిలో బీజేపీ సీనియర్‌ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. వారితో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు కూడా స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ చిన్నా చితకా సమస్య లను పరిష్కరించుకుని, ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ నాయకులు   ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.