కమలం-కోడిగుడ్డు కథ!

Publish Date:Nov 4, 2020

Advertisement

కరుణించని కాంట్రాక్టర్లు

 

టీడీపీ నుంచి వైసీపీ వరకూ అదే కథ

 

కమలం పార్టీలో ఇదో ఆసక్తికర కహానీ. ఏపీ కమలదళాలకు-కోడిగుడ్లకూ ఏదో అవినావ సంబంధం ఉన్నట్లుంది. ఈ కథ ఇప్పటిది కాదు. చంద్రబాబు నుంచి మొదలయి, జగనన్న వరకూ కొన‘సాగుతోంది’. ఏపీలో బీజేపీ పెద్దాయన ఒకరు.. సందర్భం ఏదయినా గానీ, సమయం ఏదయినా గానీ.. అంటే అది తుపానయినా కావచ్చు. కరవయినా కావచ్చు. కానీ ఆయనకు గుర్తుకు వచ్చేది మాత్రం కోడిగుడ్ల కథే. అంటే పేరు కోడిగుడ్డుదయినా.. తీరు మాత్రం ఆవుకథ అన్నమాట! ఆయనకు అది ఎవర్‌గ్రీన్!!

 

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం, ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తుంటుంది. దానికి వందల కోట్లు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం 50-60 గ్రాముల సైజు ఉండే, కోడిగుడ్లు మాత్రమే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి. కానీ పాపం.. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉండే పెద్ద తలలు, చిన్న తలలతోపాటు, రాజకీయ పార్టీలనూ తృప్తి పరుస్తుండాలి. వీరుకాకుండా, స్థానిక విలేకరులు, విద్యార్థి సంఘాల నేతలనూ ‘చూసుకోవాలి’ మరి! కాబట్టి.. సర్కారు చెప్పిన సైజు కోడిగుడ్డు సర ఫరా చేస్తే,  వచ్చే ఆదాయం సున్నకు సున్నా, హళ్ళికి హళ్లి. అందుకే ‘కాస్తంత చిన్నసైజు’ కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ఇదంతా రహస్యమేమీ కాదు. బహిరంగమే.

 

ఈ చిదంబరహస్యం తెలిసిన ఓ కమలదళ మేధావి.. పాపం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ, జగన్ వరకూ ఇప్పటిదాకా కోడిగుడ్డు కాంట్రాక్టర్లపై మనసుపారేసుకుంటూనే ఉన్నారట. అప్పటి నుంచీ వీలు దొరికినప్పుడల్లా.. ‘ఆ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లేదు. దాని సంగతి తేల్చమని’ తెగ పోరాడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడూ అదే అంశంపై, సీఎంలకు లేఖ రాస్తుంటారు. వీలు దొరక్కపోయినా, దొరికించుకుని మరీ చట్టసభలో కోడిగుడ్డనే ఆవుకథను వినిపిస్తూనే ఉన్నారు. అయినా.. అక్క ఆర్భాటమే తప్ప, బావబతికుంది లేదన్నట్లు.. ఎవరూ పట్టించుకోరు. అందుకే.. సదరు నాయకుడు, తన పార్టీ వేదికలపైనే కోడిగుడ్ల కథను వినిపిస్తుంటారు.

 

అసలు ఇంతకూ ఈ ఆవు కథ.. సారీ... కోడిగుడ్డు కథేమిటంటే.. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టరును, సదరు నాయకుడు ఓసారి వచ్చి తనను కలవమన్నారట. పెద్ద నాయకుడు. పైగా గవర్నమెంటులో భాగస్వామిగా ఉన్న నోరున్న నాయకుడాయె! పిలిచిన వెంటనే వచ్చి వాలిపోయిన కాంట్రాక్టరుకు, సదరు బీజేపీ నాయకుడు.. ‘అసలు’ విషయం చెప్పారట. ‘మమ్నల్నీ చూసుకోండనేది’ ఆయన కవి హృదయమన్నమాట! అయితే, ఆ కాంట్రాక్టరు అస్సలు భయపడకుండా.. ఇప్పటికే మేం ఉద్యమాలు చేసే పార్టీకి క్రమం తప్పకుండా నెలవారీ చందాలిస్తున్నాం. పైన ఉన్న ఉన్నవాళ్లకూ ఇస్తున్నాం. ఇక మీకూ ఇస్తే దివాళా తీస్తామని, చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయారట. దానితో బాగా హర్టయిన ఆ నాయకుడు, అప్పటి నుంచీ, కోడిగుడ్ల కథను, ఆవుకథ మాదిరిగా వినిపిస్తున్నారన్నది కమలదళాల్లో వినిపిస్తున్న చర్చ.

 

ఈ కోడిగుడ్డు కథకూ ఓ నేపథ్యం ఉందట. గతంలో ఉద్యమాలు చేసే పార్టీలో పనిచేసి, అంగన్‌వాడీలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ మహిళా నేత బీజేపీలో చేరారు. ఆమె ‘ప్రతిభ’తెలుసుకున్న సదరు బీజేపీ నేత, ఆమెను పార్టీలో బాగా ప్రోత్సహించారట. పనిలోపనిగా ఉద్యమాలు చేసే పార్టీకి అంగన్‌వాడీల నుంచి చందాలు ఎలా వస్తున్నాయన్న దానిపై పరిశోధన చేసి, ఆమె ద్వారా ఆ వివరాలు సేకరించారట. ఆ ప్రకారంగా.. ఒక్కో సెంటర్ నుంచీ వెయ్యి రూపాయలు, ఉద్యమాలు చేసే పార్టీకి విరాళాలుగా వెళతాయని తెలుసుకున్నారట. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే కదా? అదే ఈ కోడిగుడ్ల కథ!

-మార్తి సుబ్మ్రహ్మణ్యం

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.