బీజేపీ తురఫు ముక్క పాలేనా?- అమిత్ షా అప్పాయింట్ మెంట్ అందుకేనా?

Publish Date:May 14, 2022

Advertisement

రాజకీయాలలో కమేడియన్ గా అందరూ భావించే పాల్ కు తెలంగాణలో హఠాత్తుగా ఇంత ప్రాముఖ్యత ఎందుకు పెరిగిపోయింది. పాల్ ప్రసంగాలను జనం వింటారు. నవ్వుకుంటారు. టీవీల్లో ఆయన హావభావాలు ఒక కామెడీ సినేమా చూసినట్లు చూస్తారు. నవ్వు కుంటారు. అంతకు మించి పట్టించుకోరు.  2019 ఎన్నికలలో ఏపీలో ఆయన కామెడీ పాలటిక్స్ జనానికి మంచి ఎంటర్నైన్ మెంట్ ఇచ్చింది. అంతే అంతకు మించి అక్కడ ఆయన సాధించిందీ లేదు.. ఆయన పార్టీ పోటీలో ఉన్నదీ లేదు.

కానీ తెలంగాణలో ఏమైందో కానీ హఠాత్తుగా కేఏ పాల్ అనే వ్యక్తి రాజకీయ చర్చల్లో కేంద్ర బిందువుగా మారిపోయారు. గత ఎన్నికలలో ఏపీపై మాత్రమే కాన్సన్ ట్రేట్ చేసిన ఆయన ఇప్పుడు ఆ రాష్ట్రం ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో మాత్రం కలియతిరిగేస్తున్నారు. ఇక్కడ తన పార్టీ పోటీలో ఉంటుందని చెబుతున్నారు. గెలిచి చూపిస్తానని సవాళ్లూ చేస్తున్నారు. జనానికి ఆయన వాగాడంబరం అలవాటే.  కానీ ఆశ్చర్యంగా ఇక్కడ పార్టీలు మాత్రం ఆయనకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాయి. అధికారంలో తెరాస అయితే తెలంగాణలో తమకు పోటీ ఇచ్చేది పాల్ పార్టీయే అంటోంది. టీఆర్ఎస్ వర్గాలు ఆయనపై దాడి కూడా చేశాయి.

దాడిపై ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు కూడా చేశారు.  రాజకీయంగా ఆయనకు టీఆర్ఎస్ ఎందుకంత ప్రాముఖ్యాన్ని ఇచ్చిందన్న సందేహం సర్వత్రా వ్యక్తమైంది. అక్కడితో పాల్ ప్రస్థానం ఆగిపోలేదు. తనపై తెలంగాణలో దాడి జరిగిందంటూ కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేయడానికి అడగగానే ఆయనకు అమిత్ షా అప్పాయింట్ మెంట్   ఇచ్చేశారు. దీంతో అందరికీ అర్ధమైంది. పాల్ వెనుక ఉన్న బీజేపీ కారణంగానే తెరాస పాల్ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని.

తెలంగాణలో అధికారం కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్న బీజేపీ.. అందుకు ప్రత్యర్థి ఓట్లు చీల్చడం కూడా ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కారణంగా ముస్లిం ఓట్లలో చీలిక సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చి.. టీఆర్ఎస్ కు క్రైస్తవులను దూరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని వ్యూహం పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  కేఏ పాల్  ను దగ్గరకు తీస్తున్నారని వివరిస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అందరి దృష్టిలో జోకర్ అయినా.. పాల్ క్రైస్తవ మత బోధకుడిగా వెరీ సక్సెస్ ఫుల్.

ఆయన బోధనలు విని ఆయనకు అభిమానులుగా మారిన వారు కోకోల్లలు.  అందుకే బీజేపీ తెలంగాణలో కేఏ పాల్ ను దువ్వుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ వ్యూహాన్ని గుర్తించింది కనుకనే పాల్ తెరాసకు పోటీ అంటూ కేటీఆర్ వంటి వారు బహిరంగ వేదికలపై ప్రకటించి.. బీజేపీని ఇరుకున పెట్టే యత్నం చేశారు. పాల్ పై దాడికి పాల్పడటం ద్వారా ఆయన తెలంగాణలో క్రియా శీలంగా తిరగకుండా నిరోధించే ప్రయత్నం చేశారన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అమిత్ షా అడిగిన వెంటనే పాల్ కు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం.. దాడులకు వెరవ కుండా తెలంగాణలో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనేందుకు భరోసా ఇవ్వడాన్ని చూడాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
DRDO ఉద్యోగి ఎదురింట్లో ఉన్న ఓ యువతిపై మనసు పడ్డాడు.. అవకా శం కోసం ఎదురుచూశాడు యువతి ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి చొరబడ్డాడు.
ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి.
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
భారత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలను రచిస్తున్నాయి.
న్నబిడ్డలకు కడుపునిండా అన్నం పెట్టలేని నిస్సహాయత.. కనీస అవసరాలు తీర్చలేని దుర్భర పరిస్థితి.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సైబర్ భద్రతా రంగంలో తీవ్ర కలకలం రేపిన ఒక పెద్ద ఉదంతాన్ని ఎదుర్కొంది.
24 ఏళ్లకే అద్భుత ఆవిష్కరణ.. డేటా స్టోరేజ్‌ రంగంలో యువతి సంచలనం.!
ఉద్యోగ వేటలో విజయం సాధించి తొలిసారి కొలువులో అడుగుపెట్టే యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి అండగా నిలిచేలా సరికొత్త వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సోషల్ మీడియా మోజు ఎంతలా పెరిగిపోయిందంటే.. కొందరు కనీస మానవీయ విలువలను, కన్నబిడ్డల భద్రతను కూడా విస్మరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.