ఆఖరి గంటలో 9 శాతం పోల్! రిగ్గింగ్ జరిగిందని బీజేపీ కంప్లైంట్

Publish Date:Dec 2, 2020

Advertisement

గ్రేటర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా? పాతబస్తిలో పోలింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగింది? చివరి రెండు గంటల్లో ఏం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గందరగోళంగా మారింది. గ్రేటర్ పోలింగ్ పై తుది అధికారిక లెక్కలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించింది. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. గతంలో కంటే పోలింగ్ శాతం భారీగా తగ్గిందని అంతా భావించగా.. ఎస్ఈసీ లెక్కల ప్రకారం గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. చివరి గంటలో ఏకంగా తొమ్మిది శాతం పోలింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు చివరి గంటలో రిగ్గింగ్ చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి.

 

గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 3.95 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వరకు ఇది 11.62 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 20.35 శాతంగా ఉండగా.. 3 గంటల సమయానికి  29.76 శాతానికి చేరింది. సాయంత్రం ఐదు గంటలకు 36.73 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్‌ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు.దీంతో పోలింగ్ శాతం 38 శాతం ఉంటుందని భావించారు. కాని తుది లెక్కల్లో మాత్రం గ్రేటర్ లో 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఎస్ఈసీ లెక్కల ప్రకారం చివరి గంటలోనే 9 శాతం ఓటింగ్ పెరగగా.. పాతబస్తిలో ఇది దాదాపు 12 శాతంగా ఉంది. చార్మినార్ , చాంద్రాయణ గుట్టలో దాదాపు 15 శాతం పోలింగ్ చివరి గంటలోనే జరిగిందని ఎన్నికల సంఘం లెక్కలను బట్టి తెలుస్తోంది. దీంతో ఓల్ట్ సిటీలో ఓ పార్టీ చివరి గంటల్లో రిగ్గింగ్ చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి.

 

పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.  పాతబస్తీలో మజ్లీస్‌పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని తాము సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్‌ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఘాన్సీబజార్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌ డివిజన్ లో పోలింగ్‌ స్టేషన్‌ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్‌ జరిగిందని.. ఇక్కడ ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పోలింగ్ బూత్ లలోకి వెళ్లి రిగ్గింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు రాంచంద్రరావు. రిగ్గింగ్ చేసుకోవాలనే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్‌ జరపాలని కోరారు. 

 

ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు కనిపించలేదు. పాతబస్తిలోని కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు శాతం కూడా పోలింగ్ జరగలేదు. ఓల్ట్ సిటీలో ఓవరాల్ గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం5 గంటలకు మొత్తం 10 గంటల్లో 20 శాతం పోలింగ్ జరగగా... ఆఖరి గంటలోనే మరో 20 శాతం పోలింగ్ జరగడం అశ్చర్యపరుస్తోంది. ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఎవరికి అర్ధం కావడం లేదు. పోలింగ్ ముసిగిన సమయానికి ఎక్కడా ఓటర్లు లైన్‌లో ఉన్నట్లు, పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. కాని ఎన్నికల సంఘం తుది లెక్కల్లో మాత్రం పోలింగ్ 45.97 శాతానికి పెరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 9 శాతంగా నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి ఎలా పోటెత్తారన్నది అర్ధం కాకుండా ఉంది.  10 గంటల పాటు రాని ఓటర్లు చివరి గంటలో ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

ఉదయం నుంచి జరిగిన పోలింగ్.. ఎస్ఈసీ ఇచ్చిన తుది లెక్కలకో  గ్రేటర్ పోలింగ్‌లో ఆఖరి గంటలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పోలింగ్ శాతంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. మరీ ఎస్ఈసీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరీ..

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.